anant ambani viral video: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్‌నగర్ నుండి ద్వారక వరకు 140 కి.మీ పాదయాత్ర సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటన ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే అతను తన నడక ప్రయాణం మధ్యలో వందలాది కోళ్లను రెట్టింపు ధరకి కొనుగోలు చేయడంతో తన పాదయాత్రని మరింత ఆనందంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కోళ్లను కాపాడటానికి అనంత్ అంబానీ: న్యూస్ ఛానల్ ABP న్యూస్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం అనంత్ అంబానీ ఒక ట్రక్కులో దాదాపు 250 కోళ్లను కబేళాకు తీసుకెళ్తున్నట్లు చూశాడు. దింతో అతను వెంటనే ఆ ట్రక్కును ఆపి, డ్రైవర్‌తో మాట్లాడి ఆ కోళ్లను రెట్టింపు ధరకు కొన్నాడు. దీని తరువాత ఈ కోళ్లను తాను జాగ్రత్తగా చూసుకుంటానని కూడా ప్రకటించాడు. ఇదే సమయంలో అనంత్ అంబానీ చేతిలో ఓ కోడిని పట్టుకుని "జై ద్వారకాధీష్" అని నినాదాలు చేశాడు.
మతపరమైన ప్రదేశాలలో ఆశీర్వాదం: తన పాదయాత్ర ఐదవ రోజున అనంత్ అంబానీ వాద్రా గ్రామానికి సమీపంలోని విశ్వనాథ్ వేద సంస్కృత పాఠశాలకు చేరుకొని, ఇక్కడ ఆయన మగన్‌భాయ్ రాజ్‌గురు ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీని తరువాత, ఖంభాలియాలోని ఫులియా హనుమాన్ ఆలయంలో భరత్‌దాస్ బాపు ఆయనకు పూలమాల వేసి సత్కరించి, ద్వారకాధీశుడి చిత్రపటాన్ని బహుకరించారు.
ద్వారకలో 30వ పుట్టినరోజు: అనంత్ అంబానీ మార్చి 28న జామ్‌నగర్‌లోని మోతీ ఖావ్డి నుండి తన పాదయాత్ర ప్రారంభించగా, అతను ఏప్రిల్ 10న ద్వారక చేరుకుని తన 30వ పుట్టినరోజు జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాట్లు తెలిపారు. తన ప్రయాణ సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండటానికి రాత్రిపూట ఈ పాదయాత్ర చేస్తున్నారు.
యువతకు మెసేజ్: మీడియాతో మాట్లాడుతూ అనంత్ అంబానీ, "ఏదైనా పని ప్రారంభించే ముందు నేను ఎల్లప్పుడూ ద్వారకాధీశుడిని గుర్తుంచుకుంటాను. యువతకు నా మెసేజ్ ఏమిటంటే దేవునిపై నమ్మకం ఉంచడం, ఎందుకంటే దేవుడు ఉన్నచోట ఎలాంటి ఆందోళనలు ఉండవు" అని అన్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు సహకారం: అనంత్ అంబానీ కూడా వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో సహకారం చేస్తున్నారు. ఆయన చేపట్టిన "వంతరా" ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులను రక్షించారు, ఇందులో 2000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జంతు సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి "ప్రాణి మిత్ర జాతీయ అవార్డు"తో సత్కరించింది.


Click it and Unblock the Notifications