Anant Ambani: గొప్ప మనసు చాటుకున్న అనంత్ అంబానీ.. యువకుడి కోసం ప్రత్యేక విమానం..
ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ అండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ వ్యాదితో ఇబ్బంది పడుతున్న యువకుడికి అండగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఇక్బాల్ అనే యువకుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఒళ్లంతా మంటలు పుడుతున్నాయని, ఎవరో తనను ఆవహించినట్లు అనిపిస్తోందని అందుకే పగలు, రాత్రులు తేడా లేకుండా చెరువుల్లో గడుపుతున్నట్లు ఆ యువకుడు చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అనంత్ అంబానీ ఆ యువకుడికి సాయం చేయాలని నిర్ణయించారు.
వెంటనే రంగంలోకి దిగి.. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక్బాల్‌ను ముంబైకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఇక్బాల్‌ను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ప్రతిష్టాత్మకమైన సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్బాల్‌కు అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేక సరైన చికిత్స అందక ఇబ్బంది పడిన ఇక్బాల్‌కు.. ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం అందడంపై అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా నిరంతరం నీటిలో ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం నీటిలోనే గడపడం వల్ల చర్మం పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. చర్మం మెత్తబడి, బ్యాక్టీరియల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున్న వైద్యులు ఇక్బాల్‌ను ఆ పరిస్థితి నుంచి బయటపడేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కేవలం ఆర్థిక సాయమే కాకుండా.. ఒక ప్రాణాన్ని కాపాడటానికి అనంత్ అంబానీ చేస్తున్న ప్రయత్నాన్ని అందరు అభినందిస్తున్నారు. అనంత్ గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు.
తమ కుమారుడికి అనంత్ అంబానీ సాయం చేయడంపై ఇక్బాల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్బాల్ ఉన్న వ్యాధి గురించి ఇంకా నిర్ధారణ కాలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications