Ganesh Chaturdhi: ముంబైలో గణేష్ చదుర్థిని ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ప్రధానంగా లాల్‌బాగ్ రాజు వినాయకుడి విగ్రహం ప్రత్యేకమైనదని మనందరికీ తెలిసిందే. దాదాపు ఈ బోర్డు ప్రారంభించి 91 ఏళ్లు అయింది. చాలా మంది ప్రజలు ఇక్కడి అందమైన దృశ్యాలను చూసేందుకు భారీగా తరలి వస్తుంటారు.
అయితే ఈ క్రమంలో అంబానీ ఫ్యామిలీ నుంచి అనంత్ అంబానీ లాల్‌బాగ్ రాజుకు బంగారు కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మయూరాసనంపై కూర్చున వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణపతిని ప్రజలు సోషల్ మీడియా ద్వారా కూడా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే.. లాల్‌బాగ్ రాజా కిరీటం బంగారంతో చేయటమే. అనంత-రాధిక వివాహం తర్వాత ఇది మొదటి గణేశోత్సవం కావటంతో ఈ కిరీటాన్ని దేశంలోని అత్యంత ధనిక అంబానీ కుటుంబం ఆఫర్ చేసింది.

లాల్‌బాగ్‌లోని వినాయకుడి పాదాలకు నమస్కరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిఐపీలు వస్తుంటారు. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ కుటుంబం కూడా లాల్‌బాగ్ రాజా దర్శనానికి హాజరవుతుంది. ప్రస్తుతం అనంత్ అంబానీ లాల్‌బాగ్ రాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కు ట్రస్టీగా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోబడింది. దీంతో అనంత్ అంబానీ తమ కుటుంబం తరఫున 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు.
ఈ సంవత్సరం లాల్‌బాగ్ రాజు మెరూన్ వెల్వెట్ వస్త్రాన్ని ధరించి కాశీ విశ్వనాథ ఆలయ నేపథ్య దృశ్యం సాక్షాత్కరించింది. లాల్‌బాగ్‌లోని రాజా పబ్లిక్ గణేశోత్సవ్ మండల్‌లో ట్రస్టీగా నియమితులైన అనంత్ అంబానీ 20 కిలోల బరువైన రూ.15 కోట్ల విలువైన కిరీటాన్ని బహుకరించారు. దీనిని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. మెుత్తానికి అంబానీ ఫ్యామిలీకి వినాయకుడిపై ఉన్న ప్రత్యేక ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనంత్ వివాహం తర్వాత తొలి పండుగ రావటంతో ప్రత్యేకంగా దీనిని నిర్వహిస్తున్నారు అనంత్ అంబానీ.


Click it and Unblock the Notifications