Anant Ambani Wedding: దాదాపు రూ.5,000 కోట్లు వెచ్చింది ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వెడ్డింగ్ ప్రపంచాన్ని అబ్బురపరిచేలా కొన్ని నెలలపాటు కొనసాగింది. రెండు రోజుల కిందట ముంబై మెుత్తాన్ని అనంత్-రాధిక వెడ్డింగ్ సందడిలో ముంచేసింది.
ఈ క్రమంలో అనంత్ తన పెళ్లికి వచ్చిన కొందరు అతిథులకు అందించిన గిఫ్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. వాస్తవానికి అనంత్ అంబానీకి విపరీతమైన వాచ్ కలెక్షన్ అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆయన అనేక లగ్జరీ వాచ్‌లను సేకరించాడు. తాజాగా ఆడెమర్స్ పిగ్వెట్ నుంచి విలాసవంతమైన టైమ్‌పీస్‌లను అనంత్ తన స్నేహితులైన షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, మీజాన్ జాఫారీ, పహారియా సోదరులతో పాటు మరింత మందికి అందించారు. అయితే వీటి ధర ఒక్కోటి రూ.2 కోట్లుగా ఉంటుందనే విషయం సంచలనంగా మారిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు, వీడియోల్లో అనంత్-రాధిక వివాహానికి వచ్చిన కొందరు అతిథులు గులాబీ బంగారు గడియారాలను ధరించడం చూడవచ్చు. మార్కెట్లో ప్రస్తుతం Audemars Piguet ఒక్కో వాచ్ ఖరీదు దాదాపు 2,50,000 డాలర్లుగా ఉంది. అంటే మన భారతీయ కరెన్సీ విలువ ప్రకారం ఒక్కోవాచ్ రేటు ఏకంగా రూ.2,08,79,000. కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ వాటీలను కేవలం 25 మాత్రమే తయారు చేసింది.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో రాధిక-అనంత్ అంబానీల వివాహ వేడుక ఘనంగా జరిగింది. జులై 13న జరిగిన శుభ ఆశీర్వాద వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి తోడు దేశవిదేశాలకు చెందిన రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications