Anant Ambani: మోగిన అనంత్ అంబానీ పెళ్లి బాజాలు.. అసలు ఎవరు ఈ రాధికా మర్చంట్..? ఫుల్ డిటైల్స్..
Anant Ambani: రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఇతడిని మనలో చాలా మంది ఐపీఎల్ సమయంలో చూస్తుంటాం. వారి జట్టు ముంబై ఇండియన్స్ ఆట చూసేందుకు స్టేడియంకు వస్తుండారు. అయితే ఇప్పుడు అతని వివాహానికి సమయం ఆసన్నమైంది. షారుక్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు సినీ ప్రముఖులు సైతం అనంత్- రాధిక ఎంగేజ్ మెంట్ పార్టీలో తళుక్కుమన్నారు.
రెండు కుటుంబాలు..
పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, శైలాల కుమార్తె రాధిక మర్చంట్.. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి భార్యగా అడుగుపెటుతోంది రాధికా మర్చంట్. అనంత్, రాధిక చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. రెండు కుటుంబాలు వీరికి పెళ్లేచేసి ఏకం చేసే పనిలో ఉన్నాయి.
రాజస్థాన్ లో ఘనంగా..
గురువారం రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట సాంప్రదాయ రోకా వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత యువ జంట తమ రాబోయే కలయిక కోసం లార్డ్ శ్రీనాథ్‌జీ ఆశీస్సులను కోరుతూ ఆలయంలో రోజంతా గడిపినట్లు కుటుంబం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అయితే వీరి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
రాధిక మర్చంట్ ఎవరు..?
రాధిక మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో విరెన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె. రాధిక శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, ఈ సంవత్సరం జూన్‌లో తన మొదటి వేదికపై నృత్య ప్రదర్శన లేదా 'అరంగేత్రం' చేశారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అప్పట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విద్యాభ్యాసం..
అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతుండగా, రాధిక న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ప్రస్తుతం అనంత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంధన వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాధిక ఎంకోర్ హెల్త్‌కేర్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. రానున్న నెలల్లో వీరి వివహాం లాంఛనప్రాయ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.


Click it and Unblock the Notifications