ఆనంద్ మహీంద్రా నోట దివాలా మాట.!! అసలు ఏం జరిగిందంటే..
Anand Mahindra: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు ఆనంద్ మహీంద్రా. ఆయన సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంటారు. తనకు నచ్చిన అంశాలు, ప్రేరణాత్మకమైన వీడియోలను షేర్ చేస్తూ వాటిపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
సోషల్ మీడియాలో బిలియనీర్ ఆనంద్ మహీంద్రా 'ఇలా చేస్తే దివాళా తీస్తాను' అని కామెంట్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అసలు వైరల్ వీడియో పోస్టులో ఏముందో పరిశీలిస్తే.. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ఖాతాలో చికు యాదవ్ అనే చిన్న పిల్లవాడు తన తండ్రితో మాట్లాడుతున్న వీడియోను రీపోస్ట్ చేశారు. అందులో అతడు కేవలం రూ.700కి మహీంద్రా థార్ SUV కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. థార్ మరియు SUV 700 ఒకటేనని, వాటిని ఏడు వందల రూపాయలకు కొనుగోలు చేయవచ్చని తండ్రితో చెబుతున్నాడు.

అయితే రూ.700తో థార్ కొనటం కుదరదని తండ్రి వివరిస్తున్నాడు. అయితే బుడ్డోడు మాత్రం మెుండిగా తాను అనుకున్నది నిజమని వాధిస్తున్నాడు. థార్ ను రూ.700కు కొనాలని పట్టుబట్టిన చిన్నారి వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియో క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా స్నేహితుడు షేర్ చేశారు. ఆ తర్వాత మహీంద్రా & మహీంద్రా చైర్మన్ దీనికి సంబంధించిన పోస్ట్ చేశారు.
పిల్లవాడు అడుగుతున్నట్లు థార్ అమ్మితే అతి త్వరలోనే తాము దివాలా తీస్తామంటూ బిజినెస్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ వీడియోను స్నేహితురాలు సోనీ తారాపొరేవాలా ఈ వీడియోను నాకు పంపారని మహీంద్రా చైర్మన్ పోస్ట్‌లో రాశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications