For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Anad Mahindra: కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించాను.. ఆనంద్ మహీంద్రా సరదా ట్వీట్..

|

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా పోస్టు చేస్తుంటారు. ఆయన చేసిన పోస్టులన్నీ దాదాపుగా వైరల్ అవుతుంటాయి. అయితే ఆయన ట్విట్టర్ ఓ మైలురాయిని సాధించారు. ఈ బిలియనీర్ వ్యాపారవేత్త ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్ లో 10 మిలియన్ల మంది ఫాలోవర్లు సాధించారు.

సంతోషం

సంతోషం

'ఇంత పెద్ద' ట్విటర్‌ కుటుంబం ఉన్నందుకు తన సంతోషం వ్యక్తం చేశాడు మహీంద్రా. తన అభిమానులతో తరచుగా బహిరంగంగా చిట్-చాట్ చేస్తూ కనిపించే ఆనంద్ మహీంద్రా, తనపై నమ్మకం ఉంచినందుకు తన అనుచరులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆయన పోస్టుల్లో హాస్యం కనిపిస్తుంది. ట్విట్టర్‌లో తన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుండటంపై మరోసారి ఆనంద్ మహీంద్రా సరదాగా స్పందించారు.'కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను' స్పష్టంగా ఉల్లంఘిస్తున్నానని చెప్పాడు.

నమ్మడం కష్టం

నమ్మడం కష్టం

"అనుచరుల సంఖ్యలో ఈ మైలురాయిని చూసినప్పుడు నా స్పందన. నాకు ఇంత పెద్ద కుటుంబం ఉందని నమ్మడం కష్టం. (కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను స్పష్టంగా ఉల్లంఘించడం!) మీ ఆసక్తికి, నాపై మీకున్న నమ్మకానికి అందరికీ ధన్యవాదాలు. కనెక్ట్ అయ్యి ఉండండి" అని ట్వీట్ చేశాడు. ఆయన "10 మిలియన్ అని చెప్పావా?" అని రాసి ఉన్న 'gif'ని కూడా పోస్ట్ చేశారు.

శుభాకాంక్షలు

10 మిలియన్ల మంది ఫాలోవర్స్ అయిన వెంటనే ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ ఫాలోవర్స్ రోజురోజుకు పెరగాలని ఆకాంక్షించారు. కొందరైతే ఆయన అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నామని కూడా కామెంట్ చేశారు. ఆయిన ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్‌కి 800కు పైగా లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి.

English summary

Anad Mahindra: కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించాను.. ఆనంద్ మహీంద్రా సరదా ట్వీట్.. | Anand Mahindra's Twitter followers reach 10 million

Renowned industrialist Anand Mahindra created a record. But his record is not in business.. Yes, Anand Mahindra has got one crore followers on social media.
Story first published: Thursday, November 10, 2022, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X