Anand Mahindra: ఇండియన్ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్(ప్రస్తుతం X)లో తరచుగా పోస్ట్ చేస్తుంటారు. దేశం సాధిస్తున్న విజయాలు, మోటివేషన్, ఇన్ స్పైరింగ్ వ్యక్తులు గురించి స్పందిస్తూ ఉంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల ప్రారంభించిన ఓ ప్రోగ్రాంపై తాజాగా ఆయన ప్రశంసలు కురిపించారు.
రిజర్వ్ బ్యాంకు ప్రారంభించిన తాజా పైలట్ ప్రాజెక్టుపై ఆనంద్ మహీంద్ర తన అభిప్రాయాలను ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఇండోర్‌లో జరిగిన RBI బోర్డు సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఇటీవల ఆవిష్కరించబడిన పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ప్రిక్షన్‌లెస్ క్రెడిట్(PTPFC)కు సంబంధించిన వీడియో ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణాల కోసం ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగే సమయాన్ని తగ్గించేందుకు RBI చేస్తున్న కృషిని అభినందించారు.

'సామాజిక, సాంకేతిక విఘాతాలను ఎదుర్కొని ముందుకు వెళ్లడం కొన్నిసార్లు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాటికి తట్టుకుని నిలవడం విశేషం. PTPFC ద్వారా KYC, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను ఒక్కచోటికి చేర్చడం చాలా మంచి ఆలోచన. లోన్ మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి ఏకంగా నిమిషాలకు తగ్గించడం వల్ల గ్రామీణ కస్టమర్లకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక ముందడుగు పడినట్లే' అని ఆయన అభిప్రాయపడ్డారు.
రుణగ్రహీతలు, రుణదాతలను కనెక్ట్ చేయడం కోసం RBI అనుబంధ రిజర్వ్ బ్యాంకు ఇన్నొవేషన్ హబ్ PTPFC ప్రారంభించబడింది. తక్కువ మొత్తంలో రుణాల కోసం చూస్తున్న కోట్లాది మందికి క్రెడిట్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ ప్లాట్‌ఫారమ్ MSMEలుకు, 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్, డెయిరీ, వ్యక్తిగత మరియు కొలేటరల్ అవసరంలేని గృహ రుణాలను సజావుగా పంపిణీ చేయడంలో సహాయం చేస్తుంది.
ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ప్రమాణాలు కలిగి ఉండేలా ఈ ప్లాట్‌ఫారమ్ రూపొందించబడింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, బ్యాంకులను ఒకేచోటికి చేర్చడం ద్వారా రుణ మంజూరు వేగవంతం చేయాలని RBI భావిస్తోంది. మానవ ప్రమేయం తగ్గడం వల్ల ఖర్చులు తగ్గడంతో పాటు పారదర్శకత, స్కేలబిలిటీ, సామర్థ్యం పెరుగుతాయని ఆశిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications