National Highways: దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకమైనది. అందుక మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఈ విభాగంలో డెవలప్‌మెంట్ పట్ల వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
భారతదేశ రోడ్ నెట్‌వర్క్ గురించి మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా Xలో ఓ పోస్ట్ చేశారు. చైనాను ఇండియా అధిగమించిందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రపంచంలోనే అత్యధిక రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న అమెరికా తరువాత రెండో స్థానంలో భారత్ ఉండటం గర్వంగా ఉందన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో త్వరలోనే అగ్రస్థానంలో ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

'చైనా కంటే ముందంజలో ఉన్నామని చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడ పశ్చిమ భాగంలో తక్కువ మంది నివసించడం దీనికి కారణం కావచ్చు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మనం అమెరికాకు అతి చేరువలో ఉన్నాం. ఆ ఫీట్‌ను కూడా అందుకునేందుకు గడ్కరీ జీ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తారని అనుకుంటున్నాను' అని పేర్కొన్నారు. దీనికి 'ది వరల్డ్ ర్యాంకింగ్' డేటాను జత చేశారు.\
67 లక్షల కి.మీ రహదారి నెట్‌వర్క్‌తో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 52 లక్షల కి.మీ ఉన్న చైనాను వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది. కాగా అమెరికా 68.32 లక్షల కి.మీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహీంద్రా పోస్ట్‌పై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గత తొమ్మిదేళ్ల కాలంలో ఇండియాలో జాతీయ రహదారుల మొత్తం పొడవు 59 శాతం పెరిగి రెండో స్థానానికి చేరినట్లు గతేడాది జూన్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2013-14లో 91 వేల 287 కి.మీ పొడవున్న రహదులు కాస్తా 2022-23 నాటికి లక్షా 45 వేల 240 కి.మీలకు చేరినట్లు చెప్పారు. ఫాస్ట్ ట్యాగ్ వల్ల టోల్ వసూలు గణనీయంగా పెరినట్లు వెల్లడించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ మోడల్‌లో బాండ్ల ద్వారా పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంపొందించినట్లు వివరించారు.


Click it and Unblock the Notifications