ITC Demerger: ఐటీసీ హోటల్స్ డీమెర్జర్.. కొత్త షేరు ధర చెప్పేసిన అనలిస్టులు..
ITC Demerger: మెున్న రిలయన్స్.. నేడు ఐటీసీ తమ కంపెనీలను డీమెర్జర్ చేయటం ప్రారంభించాయి. తమ సంస్థల్లోని వాల్యూ అన్‌లాక్ చేసేందుకు కొత్తగా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి.
పొగాకు ఉత్పత్తుల నుంచి హోటల్స్ వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది ఐటీసీ కంపెనీ. కంపెనీ ఎఫ్ఎమ్సీజీ రంగంలో కూడా వ్యాపారాలను కలిగి ఉంది. దేశంలో అత్యంత పురాతన కంపెనీగా ఉన్న ఐటీసీ గతవారం తన హోటల్స్ వ్యాపారాన్ని విడదీయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. దీంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ITC లిమిటెడ్ తన హోటల్ వ్యాపారాన్ని విభజించాలని నిర్ణయించింది. ఈ వ్యాపారం కంపెనీ మెుత్తం రాబడుల్లో 4 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 21 శాతాన్ని కంపెనీ ఈ రంగానికి ఖర్చు చేస్తోంది. విభజన తర్వాత కంపెనీ హోటల్స్ వ్యాపారంలో 40 శాతాన్ని కలిగి ఉండనుంది. మిగిలిన 60% ITCలో వారి వాటాకు ప్రస్తుత వాటాదారులచే నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో కొత్తగా రానున్న ఐటీసీ హోటల్స్ స్టాక్ ధర రూ.21గా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా మహమ్మారి నుంచి కుదుటబడిన తర్వాత హోటల్స్ వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. FY23లో ఆదాయం దాదాపు రెండు రెట్లు పెరిగి దాదాపు రూ.2,500 కోట్లకు చేరుకుంది. క్రికెట్ ప్రపంచ కప్, G20 డిమాండ్ వృద్ధిని పెంచుతుందని హోటల్ ఇండస్ట్రీ సానుకూలంగా ఉంది. ఐటీసీ హోటల్స్ రానున్న త్రైమాసికాల్లో Welcomhotel, Mementos, Storri, Fortune బ్రాండ్ల కింద కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు నిర్ణయించింది.


Click it and Unblock the Notifications