Stock Market News: కొనసాగనున్న బుల్ రంకెలు.. హిస్టరీ రిపీట్.. సార్వత్రిక ఎన్నికలే కీలకం
Markets Rally: కరోనా విజృంభణతో పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. అంతకు పూర్వం ఉన్న రేంజ్‌ను తలదన్నే స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా దాడులు, యుద్ధాలు, సప్లై చైన్‌లో సమస్యల వల్ల ఈ జైత్ర యాత్రకు బ్రేక్ పడుతుందని అంతా భావించారు. అయితే వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటూ మార్కెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
మరి కొంతకాలం పాటు బుల్ రంకెలు కొనసాగుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశీయంగా అందుబాటులో ఉన్న ఆర్థిక వృద్ధి అవకాశాలు, ప్రస్తుత ఎన్నికల అనంతరం తిరిగి స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడే సంభావ్యత, భారతీయ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యంతో స్టాక్ మార్కెట్లు గత మూడు నెలుగా భారీ లాభాలను నమోదు చేశాయి. ఇదే పద్ధతి మేలోనూ కొనసాగించవచే అవకాశం ఉందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

'ఆయా కంపెనీల కార్పొరేట్ ఆదాయాలు సానుకూల సెంటిమెంట్‌ను ప్రదర్శిస్తుండటంతో, మార్కెట్లు తమ బుల్లిష్ సెంటిమెంట్‌ను కొనసాగించే అవకాశం ఉంది' అని మాస్టర్ క్యాపిటల్ సర్వీస్ SVP అరవిందర్ సింగ్ నందా తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇండెక్స్‌ల చారిత్రక ర్యాలీని పరిగణలోకి తీసుకుంటే, నిఫ్టీ క్రమంగా వృద్ధి చెందుతోందని హెడోనోవా CIO సుమన్ బెనర్జీ వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 9న BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ తొలిసారిగా 75 వేల మార్కును అధిగమించింది. ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 75 వేల 124ని టచ్ చేసింది. దీంతో ఏప్రిల్ 8న మొదటిసారి 400 లక్షల కోట్ల స్థాయికి చేరింది. 2024 ప్రారంభం నుంచి అధిక వాల్యుయేషన్ ఆందోళనలు ఉన్నప్పటికీ, మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ స్టాక్‌లు పెరుగుతూనే ఉన్నాయి. పుష్కలమైన దేశీయ లిక్విడిటీ మరియు ఆర్థిక వ్యవస్థ సానుకూల దృక్పథం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications