స్టాక్ మార్కెట్లు. ఏవో బ్రహ్మ పదార్థం వంటివి. ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు. కానీ, వాటినే నమ్ముకుని స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు పెట్టే వారు లక్షల్లో, కోట్ల లో కూడా ఉంటారు. అవి ఎందుకు పెరుగుతాయో... ఎప్పుడు పడిపోతాయో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. అయితే, కేవలం స్టాక్ మార్కెట్లనే నమ్ముకుని బిలియనీర్లు ఐన వారు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. అందులో అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ముందు వరుసలో ఉంటారు. మన దేశం విషయానికి వస్తే బఫెట్ కు ప్రతీకగా చెప్పుకునే వ్యక్తి రాకేష్ ఝున్ ఝున్వాలా.
అందరు ఇన్వెస్టర్లు ఒకలా ఆలోచిస్తే వీరు మాత్రం మరోలా ఆలోచిస్తారు. అందుకే వారు బిలియనీర్లు అయ్యారు. సరిగ్గా ఈ కుబేరుల ఆలోచన ధోరణి లాగే.. స్టాక్ మార్కెట్లు కూడా అందరూ పెరుగుతాయి అనుకున్నప్పుడు అవి పడిపోతాయి. ఇక వాటి పని అయిపోయిందని అంతా ఊరుకున్నప్పుడు అవి పరుగులు పెడుతుంటాయి. సరిగ్గా ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడిపోతుండగా ... స్టాక్ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ఆ విషయం ఏమిటో తెలుసుకుందామా మరి!

మన మార్కెట్లది అదే దారి...
చాలా మందికి తెలుసో లేదో తెలియదు కానీ... భారత స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కూడా దేశంలో జరిగే పరిణామాలతో పెద్దగా ప్రభావితం కావు. ఏవో బడ్జెట్ వంటి కొన్ని సందర్భాల్లో తప్ప... మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు సహజంగానైతే గ్లోబల్ మార్కెట్లనే ఫాలో అవుతాయి. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లను కాపీ కొట్టినట్లుగా ప్రవర్తిస్తాయి.
దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్, బలమైన మార్కెట్, బలమైన కరెన్సీ కలిగిన ఏకైక దేశం అమెరికా. అక్కడ పరిస్థితి అంతా సవ్యంగా ఉందంటే ... ప్రపంచం కూడా సాఫీగా నడుస్తుందని ఒక నమ్మకం. అదే ఇప్పుడు స్టాక్ మార్కెట్ల ధోరణి లోనూ ప్రస్ఫుటం అవుతోంది. మన మార్కెట్లు కొంత వరకు యూరోప్ మార్కెట్లను, జపనీస్ మార్కెట్లను కూడా అనుసరిస్తాయి. ఎందుకంటే, భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికా, యూరోప్, జపాన్, గల్ఫ్ దేశాలు ఉంటాయి. చైనా కూడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ ఆ దేశ మార్కెట్ల ప్రభావం కొంత తక్కువేనని చెప్పాలి. గోల్డ్, చమురు వంటి కమోడిటీ ట్రేడింగ్ కూడా మన మార్కెట్ల ను ప్రభావితము చేస్తాయి.

అందుకే పెరుగుతున్నాయి...
కరోనా ప్రభావంతో ఎక్కువగా దెబ్బతిన్నది అమెరికా అని చెప్పొచ్చు. ఆ దేశంలో ఇప్పటికే 5 లక్షల మందికి వైరస్ సోకి, సుమారు 20,000 మంది చని పోయారు. ఈ దెబ్బకు ఆ దేశంలో నిరుద్యోగం 10 రెట్లు పెరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సహజంగానైతే ఈ విషయాలు చాలా ఆందోళనకరం. కానీ, ఆ దేశం ప్రస్తుత విపత్కర పరిణామాలను ఎదుర్కొనేందుకు 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది.
అంటే అమెరికా దేశ జీడీపీ 21 ట్రిలియన్ డాలర్ల లో ఇది దాదాపు 10% నికి సమానం. కాబట్టి, ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నా... అవి మరో 2-3 నెలల్లో సర్దుకుంటాయి. ఆర్థిక ప్యాకేజీ మద్దతు తో ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి, ఒక దేశ జీడీపీ లో 10% కంటే తరుగుదల నమోదు కావటం జరగదు. కాబట్టి, ఆ ఎకానమీ కి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. దీనిని గమనించిన గ్లోబల్ ఇన్వెస్టర్లు అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఇండియా లో కూడా ఉంది. కరోనా వైరస్ తో మృతి చెందిన వారు మన దగ్గర తక్కువే అయినా... లాక్ డౌన్ వల్ల నెలకొన్న పరిణామాలతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కానీ, భారత ప్రభుత్వం కూడా ఆర్థిక ప్యాకేజీ లు ప్రకటిస్తోంది. ఈ కారణాలతో మన మార్కెట్లు కూడా పరుగులు పెడుతున్నాయి.

భవిష్యత్ ను ముందే చెబుతాయి...
స్టాక్ మార్కెట్ల కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచంలో ఒక ఏడాది తర్వాత జరగబోయే అంశాలను ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్లు ప్రవర్తిస్తుంటాయి. మొన్నటి వరకు మన మార్కెట్లు దాదాపు వాటి గరిష్ట స్థాయి నుంచి దాదాపు 50% పతనం అయ్యాయి. సెన్సెక్స్ ఐతే 25,000 పాయింట్ల స్థాయికి, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు పతనం అయ్యాయి. కానీ... మళ్ళీ అవి ప్రస్తుతం పుంజుకుని కేవలం కొన్ని రోజుల్లోనే మళ్ళీ చాలా వరకు నష్టాలను పూడ్చుకోవటం విశేషం.
ప్రస్తుతం మార్కెట్లు బుల్ రన్ కొనసాగిస్తున్నాయంటే.. వచ్చే ఏడాది కాలంలో మన ఆర్థిక వ్యవస్థ కు పెద్దగా ఇబ్బందులు లేవనే ఇండికేషన్ ఇస్తున్నాయని మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ప్రభావం స్వల్ప కాలంలో మాత్రమే కనిపిస్తుందని, వచ్చే 12-18 నెలల సమయంలో మన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకుంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సో, అదన్నమాట అసలు విషయం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications