కరోనా మహమ్మారి అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ధరల యుద్ధం కారణంగా చమురు ధర అడుగంటుతోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లకు మిగిలి ఉన్న ఆప్షన్ బంగారం వంటి అతి ఖరీదైన లోహాలు! సాధారణంగా ఇన్వెస్టర్లకు ఇవి ఎప్పుడు కూడా పెట్టుబడుల స్వర్గదామమే. కొన్ని సందర్భాల్లో మాత్రం వెనుకాడుతుంటారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

ఇన్వెస్టర్ల ఆందోళన
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది చనిపోయారు. 2,20,000 మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో 84 వేల మంది రికవరీ అయ్యారు. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్ నుండి బంగారం దిశగా అడుగు..
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక మందగమనం పరిస్థితుల్లోకి కరోనా నెట్టే పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాలపై భారీ ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లను పక్కన పెట్టి బంగారం వంటి వాటిపై పెట్టుబడి పెట్టేందుకు మొదట ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు.

చేతిలో లిక్విడిటీ కోసం..
కానీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ బంగారం నుండి కూడా పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు లేదా కొనుగోళ్లను నిలిపివేశారు. చేతిలో లిక్విడ్ ఉంచుకునేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.

కొనుగోలుకు దూరం చేస్తోంది
బంగారంపై పెట్టుబడులు పెట్టకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ధరలు హఠాత్తుగా పెరుగుతున్నాయి. స్వల్పంగా తగ్గుతున్నాయి. పసిడి ధరలు నిలకడగా కనిపించడం లేదనేది విశ్లేషకుల మాట. పది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1700 డాలర్లకు పైగా ఉండగా, ఇప్పుడు 1450 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ మార్కెట్లో రూ.45వేల నుండి రూ.40వేల దిగువకు దిగి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ పెట్టుబడి స్వర్గదామమేనా అనే ఆలోచన కూడా చాలామంది ఇన్వెస్టర్లలో ఉంది. అంటే బంగారం ధరల్లో నిలకడలేనితనం కొనుగోలుకు దూరం చేస్తోంది.

తగ్గడానికి మరో కారణం..
బంగారం ధరలు భారీగా పెరిగిన సమయంలో కొంతమంది మార్జిన్ రావడంతో అమ్మకానికి దిగారు. దీంతో ధరలపై ప్రభావం పడి తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు, ఈక్విటీలలో మార్జిన్ లేదా అప్పు తీసుకున్న డబ్బుతో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దీంతో బ్రోకర్ అదనపు మార్జిన్ పెట్టమని అడుగుతారు. అప్పుడు కొంతమంది ఈక్విటీలను విక్రయించడానికి బదులు బంగారం అమ్మకానికి మొగ్గు చూపుతారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఇప్పుడు కొనవచ్చా అంటే?
బంగారం ధరలు ఇప్పటికే భారీగా తగ్గాయి. పది రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో 250 డాలర్లు, దేశీయ మార్కెట్లో దాదాపు రూ.5,000 తగ్గాయి. ఇప్పుడు తగ్గినందున కొనుగోలు చేయవచ్చా లేదా అనే కన్ఫ్యూజన్‌లో చాలామంది ఉన్నారు. బంగారం ధరలు ఇంతకు మించి మరీ తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పలేమని అంటున్నారు. ఒకవేళ ఎంత తగ్గినా మరో రూ.500 లేదా రూ.1000 తగ్గవచ్చునని అంటున్నారు. ఇంతకుమించి తగ్గుదల కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. పెరిగితే మాత్రం మళ్లీ గరిష్టానికి కూడా చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. కొనుగోలుపై ఆచితూచి అడుగు వేయాలని అంటున్నారు.

పెట్టుబడి పెట్టవచ్చా అంటే..
బంగారం అవసరం మేరకు కొనుగోలు చేసుకోవచ్చునని, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిపెట్టినా పెద్దగా నష్టమేమీ ఉండదనేది నిపుణుల అభిప్రాయం. కరోనా ప్రభావం తగ్గినా, మార్కెట్ తిరిగి పుంజుకున్నా బంగారం మరీ దారుణంగా పడిపోయే పరిస్థితులు ఉండవని అంటున్నారు. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలని అంటున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications