హెచ్1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు జారీ చేయకూడదని ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై నాస్కాం సహా భారత ఐటీ నిపుణులు స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం చేస్తుందని, అమెరికాలో నిపుణులు లభించడం కష్టంగా ఉందని, దీంతో యూఎస్ కంపెనీలు తమ సేవలను ఆఫ్‌షోర్ ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తాయని చెబుతున్నారు. ఈ రద్దు ద్వారా ఇప్పటికే అమెరికాలో ఉన్నవారిపై ప్రభావం ఉండదు.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం
వర్క్ వీసాల జారీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని, దీనివల్ల అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమై ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని నాస్కాం పేర్కొంది. అవసరమైన మేరకు అమెరికాలో ప్రతిభ కొరవడినందున అమెరికా, భారత ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశముందని అభిప్రాయపడింది.
యూఎస్‌లో అత్యంత నిపుణులైన వలసదారుల ద్వారా పలు హాస్పిటల్స్, ఫార్మా, బయోటెక్ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్ సంస్థలతో పాటు వేలాది వ్యాపార సంస్థలకు నాస్కామ్ సభ్యులు అత్యవసర సేవలను అందిస్తోందని గుర్తు చేసింది. కరోనా ఔషధాలను అందుబాటులోకి తేవడం కూడా జాప్యం అవుతుందని తెలిపింది. ఆంక్షల వ్యవధిని 90 రోజులకు కుదించాలని సూచించింది.

ఎలాగూ కరోనా ఆంక్షలు.. ప్రభావం తక్కువే
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై వివిధ రకాల ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా పెద్ద ఎత్తున ఐటీ నిపుణులు రావడం, పోవడం వంటివి తక్కువేనని, కాబట్టి డిసెంబర్ వరకు అమెరికా రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ పెద్దగా వచ్చే నష్టమేమీ లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ తర్వాత పొడిగింపు లేదా శాశ్వత ప్రాతిపదికిన చేస్తే మాత్రం ఇబ్బందే అంటున్నారు.

అమెరికాలో పోయింది నాన్ ఐటీ ఉద్యోగాలు
అమెరికాలో ఇటీవల లక్షలు, కోట్లాది ఉద్యోగాలు పోయాయి. త్వరలో ఎన్నికల నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. కానీ కరోనా సమయంలో అమెరికన్లు పెద్ద ఎత్తున కోల్పోయింది నాన్-ఐటీ ఉద్యోగాలు అని గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఐటీ ఉద్యోగాల సంఖ్యలో క్రమంగా పెరుగుదల కనిపించిందని చెబుతున్నారు. చైనా వంటి దేశాల నుండి సంస్థలు అమెరికాకు వచ్చే అవకాశముంది. అప్పుడు ఉద్యోగుల అవసరం ఉంటుంది. దీంతో నిపుణులకు లోటులేని భారత్ వైపు అమెరికా చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలా ఉన్న ముందు ముందు భారత్ అవసరం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో సరళతరం
అమెరికా సహా వివిధ దేశాల్లో మన ఐటీ కంపెనీలు గతకొంతకాలంగా స్థానికులనే ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను మన దేశం వంటి ఆఫ్‌షోర్ ప్రాంతాలకు అధికంగా తరలించే అవకాశముందని, మన కంపెనీలు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని ఐటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మరో విషయం ఏమంటే అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చాల వరకు ఖాళీ ఉన్నాయని, భవిష్యత్తులో నిపుణుల కోసం హెచ్1బీ వీసాల జారీ సరళతరం చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటున్నారు.

అమెరికా సంస్థలకే నష్టం.. అలా మనకు లాభం
ట్రంప్ నిర్ణయం పట్ల అమెరికా టెక్ దిగ్గజాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఆర్థిక విజయానికి, సాంకేతిక రంగంలో ప్రపంచనేతగా ఎదిగేందుకు వలసలు ఎంతో ఉపయోగపడడాయని, గూగుల్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే వలసలే కారణమని, అమెరికా నిర్ణయం అసంతృప్తికి గురి చేసిందని, వలసదారుల పక్షాన నిలుస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వంటి విదేశాల నుండి తక్కువ వేతనాలకు మంచి టెక్ నిపుణులు వస్తారని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం ఆందోళన కలిగిస్తుందని ఇతర అమెరికా టెక్ సంస్థలు కూడా అంటున్నాయి.
గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలకు కూడా షాకే. ఈ ఉత్తర్వులతో విదేశీయులను తీసుకోలేవు. పని చేసే సామర్థ్యం అమెరికన్లలో తక్కువగా ఉండటంతో వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఆసక్తి చూపరని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ తాత్కాలిక రద్దు వల్ల అమెరికా టెక్ సంస్థలే నష్టపోతాయని అంటున్నారు.
అమెరికాలో ఐటీ నైపుణ్యం గల ఉద్యోగులకు తీవ్ర కొరత ఉందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ప్రాజెక్టులను కంపెనీలు ఆఫ్‌షోర్ లొకేషన్లకు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. దీంతో భారత ఐటీ పరిశ్రమకే లాభం అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications