Raymond News: సొంత ఇల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తీ భావిస్తుంటాడు. అయితే శ్రీమంతుల విషయం వేరు. ఎంత పెద్ద భవనాలు ఉంటే అంత గొప్పగా చెబుతుంటారు. అందుకే ఇంటి కోసం వేల కోట్లు వెచ్చించేందుకు కూడా ఏ మాత్రం వెనకాడరు. దేశంలో అత్యంత విలువైన ఇల్లుగా ముకేశ్ అంబానీ కి చెందిన యాంటీలియా ప్రసిద్ధిగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా బకింగ్ హామ్ ప్యాలెస్ తర్వాత అత్యంత విలువైన భవనంగా రికార్డులు అందుకుంది. మరి అంబానీ ఇంటి పక్కన ఇల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
ముంబైలోని ఆల్ట్ మౌంట్ రోడ్ అత్యంత విలాసవంతమైన భవనాలకు ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలో అత్యంత సంపన్నులు అయిన ముకేశ్ అంబానీ నివాసం యాంటిలియా ఇక్కడే ఉంది. దాని పక్కనే మరో దేశీయ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియా గృహం కనిపిస్తుంది. ఆయన మరెవరో కాదు వస్త్రాల వ్యాపారంలో ఎంతో ఖ్యాతి గడించిన రేమండ్ సంస్థల అధినేత. దాని విలువ 6 వేల కోట్లకు పైగానే ఉంటుందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

JK హౌస్ గా పిలవబడే ఈ భవనంలో 30 అంతస్తులున్నాయి. భారతదేశంలో రెండో అత్యంత ఎత్తైన ప్రైవేటు భవనం ఇదే కారణం గమనార్హం. ఇందులో 2 స్విమ్మింగ్ పూల్స్, 5 అంతస్తుల పార్కింగ్, హెలిపాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ వంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. వీటితోపాటు ఇంటి కింద రేమాండ్ షోరూం కూడా ఉంటుంది ఇంతటి గొప్పవారి ఇళ్లు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని 'బిలియనీర్స్ రో' గా పిలుస్తుంటారు
ఇక గౌతమ్ సింఘానియా విషయానికొస్తే ఈ మధ్యన వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. తండ్రితో ఆస్తి తగాదాలు, భార్యతో విడాకులు వంటి విషయాలు సంచలనంగా మారాయి ఈ దెబ్బతో రేమండ్ కంపెనీలోని వివిధ స్థాయిల నుంచి ఆయన తప్పుకున్నారు. కాగా ఇటీవలే మరోసారి ఆయన ఐదేళ్లపాటు కంపెనీ CEO కొనసాగుతూ తమను నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన పనుల్లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications