Bank Deposits: రెండు వారాల్లో భారీగా పెరిగిన బ్యాంకు డిపాజిట్లు..!

బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. జూన్ 30, 2026 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లు రూ. 265.4 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, టైమ్ డిపాజిట్లు రెండింటిలోనూ పెరుగుదల నమోదు చేసింది. గత రెండు వారాల వ్యవధిలోనే వ్యవస్థలో సుమారు రూ. 7 లక్షల కోట్లు మేర పెరుగుదల నమోదైంది. ఈ తాజా పెరుగుదలతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి డిపాజిట్ల వృద్ధి రేటు 13.3%కి పెరిగింది. 29 ఏళ్లలో ఇది మూడో అత్యధిక వృద్ధి. ఇది ఏడాది క్రితం 10.1 శాతంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. డిపాజిట్ల వృద్ధి రేటు రుణాల (క్రెడిట్) వృద్ధి రేటు కంటే తక్కువగా ఉంది. జూన్ 30, 2026 నాటికి బ్యాంక్ రుణాలు రూ. 219.3 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఈ రెండు వారాల కాలంలో రుణాలు రూ. 3.8 లక్షల కోట్లకు పెరిగాయి. వార్షికంగా రుణాల వృద్ధి రేటు 18.6 శాతంగా నమోదు అయింది. మొదటి మూడు నెలల్లో నమోదైన వృద్ధి ఆ రెండు వారాల వృద్ధి కంటే తక్కువగా ఉంది. విదేశీ నిధుల రాబట్టడానికి, రూపాయి విలువను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో భారత్ కు 7 బిలియన్ డాలర్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు వచ్చాయిని ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఆ సంఖ్య 15 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల వృద్ధి ఎక్కువగా కొనసాగుతుండటంతో ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉండే తమ పెట్టుబడుల విషయంలో బ్యాంకులు నెమ్మదిగా వ్యవహరిస్తున్నాయి.

Bank

మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి బ్యాంకుల పెట్టుబడులు రూ. 70.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక డెట్ ఎఫ్‌‌ఏఆర్ ఇన్ ఫ్లోస్ విలువ 2.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంక్ క్రెడిట్ ఈ ఏడాది రూ.5.6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ భారీ డిపాజిట్ల వల్ల బ్యాంకుల్లో లిక్విడిటీ మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ లో బ్యాంకులు రుణాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్యాంకులు ఎక్కువగా హోం లోన్, బంగారంపై లోన్లు ఇస్తున్నాయి. అయితే ఇందులో ఇల్లు, బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వడం వల్ల బ్యాంకులకు రుణాలు డిపాల్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

దేశంలో బంగారంపై రుణాలు క్రమంగా పెరుగుతున్నాయి. బంగారం ధర పెరుగడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాలు దాదాపు 84 శాతం పెరిగాయి. బంగారం ధర పెరగడం వల్ల రుణం కూడా ఎక్కువ వస్తున్న తరుణంలో చాలా మంది బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. అంతే కాకుండా బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం కూడా బంగారం రుణాలు పెరగడానికి కారణమైందని ఓ నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+