ఉద్యోగాన్ని వదిలివేసి వ్యాపారం చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకు కావాల్సింది దృఢమైన సంకల్పం, ధైర్యం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. అయితే జైపూర్‌కు చెందిన సిద్ధి గార్గ్ కూడా అలంటిదే చేశారు. సిద్ధి గార్గ్ ఒక ఐటీ ఇంజనీర్. కానీ ఇప్పుడు ఆమె ఉద్యోగం మానేసి కుర్తా వ్యాపారం చేస్తుంది. ఆమె 'కుర్తా ఘర్' బ్రాండ్ కింద కుర్తాలను అమ్ముతుంది. నేడు ఆమె ఏడాది టర్నోవర్ లక్షల రూపాయలు. ఇంకా ఆమె తయారు చేసే కుర్తాలకు చాలా డిమాండ్ కూడా ఉంది.
సిద్ధి గార్గ్ వ్యాపారం ఏంటి : సిద్ధి గార్గ్ చేతితో తయారు చేసిన కుర్తాలు అమ్ముతుంది. ఆమె కుర్తా ప్రత్యేకత అందులో ఉపయోగించే గోటా పట్టి. దీనిని గోల్డెన్ మెటల్ రిబ్బన్ వర్క్ అని కూడా అంటారు. బంగారు లోహంతో రిబ్బన్ వర్క్ అంటే గోటా పట్టి రాజస్థాన్ రాజ సభల నుండి ఉద్భవించింది. ఈ రోజుల్లో గోటా పట్టి భారతీయ దుస్తులలో ముఖ్యంగా లెహంగా, చీర, కుర్తీలలో ఎక్కువగా కనిపిస్తుంది. గోటా పట్టిని తయారుచేయడానికి గోల్డ్ మెటాలిక్ రిబ్బన్లను కత్తిరించి డిజైన్ చేస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్, మెరుపును సృష్టిస్తుంది.

ఈ వ్యాపారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది: 'కుర్తా ఘర్' కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రారంభమైంది. సిద్ధి గార్గ్ మాట్లాడుతూ 'నేను లోకల్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు, చాలా మంది చేనేత వస్త్రాలు అమ్మడం చూశాను. కానీ వాళ్ళు నిజమైన చేనేత ధర పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. కస్టమర్ల నుండి సుమారు రూ.14,000 వరకు వసూలు చేస్తున్నారు. నాకు అది న్యాయంగా అనిపించలేదు. 2022 సంవత్సరంలో ఉద్యోగాన్ని వదిలి 'కుర్తా ఘర్' అనే స్టార్టప్‌ను ప్రారంభించాను. ఈ స్టార్టప్ రాజస్థాన్ సాంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా తక్కువ ధరలకు దుస్తులను అందిస్తోంది అని అన్నారు.
కేవలం 7 వేల నుండి ప్రారంభం: కుర్తా ఘర్ ప్రారంభించడానికి ముందు సిద్ధి గార్గ్ 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగం మానేసిన తర్వాత, సిద్ధి గార్గ్ చెల్లెలికి ఫైనాన్స్ వ్యాపారంలో సహాయం చేసింది. కొంత కాలం తరువాత కుర్తా ఘర్ ప్రారంభించింది. సిద్ధి గార్గ్ ఈ వ్యాపారాన్ని కేవలం 7 వేలతోనే స్టార్ట్ చేసింది. సిద్ధికి ఈ రంగం గురించి అనుభవం లేదు, కానీ ఆమె దృఢ సంకల్పం, ధైర్యంతో ముందుకు సాగింది.
ప్రతి నెలా 200 నుండి 300 ఆర్డర్లు: సిద్ధికి ఒక సొంత వెబ్‌సైట్ ఉంది. ఆమెకి నెలకు 200-300 ఆర్డర్లు వస్తాయి. అది కూడా దేశం నలుమూలల నుండి. ఇది కాకుండా విదేశాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయి. ఆమెకి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కూడా కస్టమర్లు ఉన్నారు. సిద్ధి ఉద్దేశం కేవలం బట్టలు అమ్మడమే కాదు, శతాబ్దాల నాటి ఈ హస్తకళలను సంరక్షించడం, ప్రోత్సహించడం కూడా. ఈ కుర్తాలు స్టోర్స్, ఆన్‌లైన్ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
ఏడాదికి టర్నోవర్ ఎంత: సిద్ధి తన వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో నడిపిస్తుంది. ఆమె కుర్తాలను దేశంలోని చాల నగరాల్లో విక్రయిస్తుంటుంది. చాలా మంది ఆమెకి రెగ్యులర్ కస్టమర్లుగా కూడా మారారు. ఆమె కుర్తాలలో గోటా పట్టితో పాటు జర్దోజీ, ముత్యాలను కూడా ఉపయోగిస్తుంది. ఈ బ్రాండ్ లిస్టులో కుట్లు వేయని సూట్లు, చీరలు ఇతర సాంప్రదాయ దుస్తులు కూడా ఉన్నాయి. వీటి ధర సాధారణంగా రూ. 1995 నుండి ప్రారంభమవుతుంది. ఈ సిద్ధి వ్యాపార ఏడాది ఆదాయం రూ. 30 లక్షలు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications