Post Office Recurring Deposit: నెలకు రూ.5 వేలతో రూ.8.46 లక్షలు సంపాదించవచ్చు..!
కొంద మంది తాము సంపాదించిన డబ్బులో కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటారు. ఇలాంటి వారికి పోస్టాఫీస్ సేవింగ్ పథకాలు మంచి ఎంపిక అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి సురక్షితంగా ఉండడంతో ఎక్కువ మంది వీటిలోనే పెట్టుబడి పెడతారు. అయితే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ప్రజాదారణ పొందిన పథకంగా ఉంది. ఇది రక్షణతో కూడిన రాబడిని ఇస్తుంది.
అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను 6.2 శాతం నుంచి 6.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అంటే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు పెంచారు. ప్రసుత వడ్డీ రేటుతో ఈ పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు మరింత లాభదాయకమని చెబుతున్నారు.

అవకాశాన్ని బట్టి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో చేరాలంటే కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు ఉండాలి. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరుతో ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈ పథకం కల్పిస్తోంది. ఈ పథకంలో ఖాతా తెరవడం ద్వారా మీరు కేవలం రూ.100 నుంచి పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
ఈ పథకంలో 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ పోస్టాఫీసు స్కీమ్ ఖాతాలో నెలకు రూ. 5,000 స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేసి, ఈ ప్రక్రియను పూర్తిగా 10 సంవత్సరాలు కొనసాగిస్తే, మీ డిపాజిట్ ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ రేటును పొందుతారు. అది రూ.2.46 లక్షలు. అలాగే మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. దీని ప్రకారం మీరు 10 సంవత్సరాల తర్వాత రూ.8.46 లక్షలు పొందుతారు. ఇప్పుడు ఈలోగా, ప్రభుత్వం సంస్కరించి వడ్డీ రేటును పెంచితే, దాని ప్రకారం మీకు వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది.
పోస్ట్ ఆఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఖాతాను తెరిచిన 3 సంవత్సరాల తర్వాత మూసివేయవచ్చు. దీనితో పాటు, పెట్టుబడిని ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత 50 శాతం వరకు రుణ సౌకర్యం కూడా అందిస్తున్నారు. సరళంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఈ పథకంలో ఖాతా తెరిచిన తర్వాత 12 నెలల పాటు వాయిదాలను డిపాజిట్ చేస్తే, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. ఈ పథకంలో మీరు మీ మొత్తం డిపాజిట్‌లో సగం రుణం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications