Gold: రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.7.28 లక్షలు వచ్చాయి.. బంగారమా.. మజాకా..!
బంగారంపై పెట్టుబడి ఎప్పటికీ నష్టం కాదని కొంత మంది చెబుతుంటారు. వారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. అందుకే మన పూర్వీకులు పసిడిని కొనుగోలు చేయడం అలవాటుగా మనకు నేర్పించారు. పెళ్లిళ్లైనా, శుభకార్యాలు అయినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం విలువ భారీగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బంగారం కొనడం కంటే పసిడి బాండ్లపై పెట్టుబడి పెట్టాలని సూచించి.. సావరిన్ గోల్డ్ బాండ్లు తీసుకొచ్చింది. పలు సిరీస్ లుకా సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించింది. అప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది.
ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ 8 సంవత్సరాలు ఉంది. అయితే ఆర్బీఐ ఐదేళ్ల తర్వాత రీడిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. తాజాగా 2020 మార్చి 11న జారీ చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ X బాండ్లకు ముందుస్తు రీడిమ్ అవకాశం కల్పించింది. అయితే 2020 మార్చి 11న ఒక గ్రాము బంగారం ధర రూ.4,210గా విక్రయించారు. ఈ సిరీస్ బాండ్లకు 2026 సెప్టెంబర్ 11న ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ధరను ప్రకటించింది. ఒక గ్రాము బంగారం ధరను రూ.15,328గా నిర్ణయించారు. గ్రాముకు రూ.4,210 కి కొంటే ఇప్పుడు రూ.15,328 వస్తున్నాయి. ఒక్క గ్రాముపై రూ.11,118 లాభం వచ్చింది. అంటే సుమారు 264 శాతం వరకు రాబడి వచ్చింది.

ఈ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ లో ఓ వ్యక్తి రూ.2 లక్షళు పెట్టుబడి పెడితే... అతనికి దాదాపుగా 47.50 గ్రాముల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్ యూనిట్లు వచ్చేి. ఇప్పుడు ఒక్క గ్రాము రూ.15,328 చొప్పున లెక్కిస్తే వాటి విలువ సుమారు రూ.7.28 లక్షలు వచ్చేవి. అంటే రూ.2 లక్షల పెట్టుబడి పెడితే రూ.5.28 లాభం వచ్చేది. ఇక్కడ బంగారం ధర పెరగడమే కాదు... సావెరిన్ గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని కూడా ఇస్తోంది. ఈ వడ్డీని సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. వడ్డీ కూడా అదనంగా వచ్చినట్లే. సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం ఎనిమిది సంవత్సరాలుగా ఉంటుంది. ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొన్ని నిర్ణీత తేదీల్లో ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
