వారానికి 6 రోజులు, రోజుకి 14 గంటలు.. వర్క్ కల్చర్ పై సీఈఓ పోస్ట్ వైరల్..
వర్క్ టైమింగ్ విషయంలో ఒకొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. సాధారణంగ అయితే 8 గంటలు పని చేయాలి ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో 10 అలాగే 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. కానీ స్టార్ట్ అప్ లేదా కొన్ని కంపెనీల అధినేతల సూచనలు ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (NR Narayana Murthy) వర్క్ కల్చర్ సంబంధించి ఒక ప్రకటన చేసారు, దానిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం, చర్చ జరిగింది. ఆ సమయంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై తనకు నమ్మకం లేదని నారాయణమూర్తి అన్నారు. అంతేకాదు ప్రజలు వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి వారానికి 100 గంటలు పని చేయగలిగితే, మనం ఎందుకు పని చేయలేము అని ప్రధాని నరేంద్ర మోడీని మూర్తి ఉదాహరణగా చెప్పారు!
ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన సీఈఓ దక్ష్ గుప్తా తన స్టార్టప్ వర్క్ కల్చర్ సంబంధించి వార్తల్లో నిలిచారు. నిజానికి అమెరికాలో ఉంటున్న దక్ష్ గుప్తా తన AI స్టార్టప్ కంపెనీ గ్రాప్‌టైల్‌కు 84 గంటల వర్క్ వీక్ ఉందని చెప్పారు. అంటే వారానికి 6 రోజులు, రోజుకు 14 గంటలు ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. మా స్టార్టప్‌లో శనివారం సెలవు ఉండదని, కొన్నిసార్లు ఆదివారం కూడా పని చేయాల్సి ఉంటుందని దక్ష్ గుప్తా అన్నారు.

హత్య బెదిరింపులు
దక్ష్ గుప్తా తన స్టార్టప్ వర్క్ కల్చర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తన స్టార్టప్‌లో వర్క్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని చెప్పాడు. మా కంపెనీలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు అవకాశం లేదని ఉద్యోగ ఇంటర్వ్యూలో మొదటి రౌండ్‌లోనే అభ్యర్థికి చెబుతున్నామని ఆయన అన్నారు. మొదట్లో ఇలా చెప్పడం కాస్త వింతగా అనిపించినా ఇప్పుడు మాత్రం పారదర్శకంగా ఉండటమే కరెక్ట్ గా అనిపిస్తోంది.
సీఈఓ దక్ష్ గుప్తా పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది, దీనికి ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయి. ఇంకా సోషల్ మీడియాలో యూజర్ల నుంచి రకరకాల రియాక్షన్స్ ఇంకా కొంతమంది యూజర్లు దక్ష్ గుప్తా పారదర్శకతను ప్రశంసించగా, చాలా మంది దీనిని 'టాక్సిక్ వర్క్ కల్చర్'గా పేర్కొన్నారు. ఈ విమర్శల మధ్య దక్ష్ గుప్తా మరో పోస్ట్ కూడా చేసాడు, అందులో తనకు కూడా హత్య బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నాడు. నా ఇన్‌బాక్స్‌లో 20 శాతం హత్య బెదిరింపులు ఉన్నాయని, 80 శాతం ఉద్యోగ అప్లికేషన్స్ అని పోస్ట్ చేసాడు.
ఈ వరుసలో ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఒక పాత ఇంటర్వ్యూ కూడా వైరల్ అయ్యింది. అందులో తాను రోజుకు 20 గంటలు పని చేస్తానని పేర్కొన్నారు. 70 గంటల పని అంటూ నారాయణ మూర్తి చేసిన ప్రకటనను కూడా ఆయన సమర్థించారు.


Click it and Unblock the Notifications