Lay Off's: రాత్రికి రాత్రే ఉద్యోగం కోల్పోయాం.. కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ఉద్యోగి ఆవేదన..!
ఏఐ రాకతో దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తారోనని ఆందోళనతో ఉన్నారు. తాజాగా ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగి తన ఆవేదనను బయట పెట్టారు. తమ ఇంజనీరింగ్ టీమ్ లో రాత్రికి రాత్రే 150 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. 1.8 సంవత్సరాలు పని చేసి తర్వాత తనకు రాత్రికి రాత్రే ఉద్యోగం కోల్పోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ రోజు తన జీవితంలో కఠినమైన రోజుగా అభివర్ణించారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే టీమ్ మొత్తాన్ని తొలగించిందని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదని పోస్ట్ లో తెలిపారు. తమ ఇంజనీరింగ్ బృందంలో దాదాపు 150 మంది పని చేస్తారని చెప్పారు. వీరందరికి రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్ ఇన్విటెషన్ పంపారని చెప్పారు. మీటింగ్ జాయిన్ అయిన తర్వాత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టీమ్ తొలగిస్తున్నట్లు ప్రకటించారని వివరించారు. ఈ వార్త తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఆ కంపెనీలో ఇంటర్న్‌గా చేరినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తికాల ఉద్యోగిగా మారే క్రమంలో దాదాపు రెండు సంవత్సరాలు గడిపానని ఆ టెక్నీషియన్ తెలిపారు. అయితే ప్యాకేజీ లేకుండానే తొలగించడం బాధగా ఉందని చెప్పారు.హై-వీ ఇండియా ఇంజనీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్ట్ పెట్టారు.
తమ హై- ఇండియా కంపెనీ మూసేశారన్నారు. అందరం ఉద్యోగం కోల్పోయామని గోయాల్ రాసుకొచ్చారు. గోయాల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉద్యోగం నుంచి ఎలాంటి ప్యాకేజీ లేకుండా తొలగించడం అన్యాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ కామన్ అయిపోయాయని అన్నారు.
దిగ్గజ సాఫ్ట్ కంపెనీ ఒరాకిల్ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 20 వేల నుంచి 30 వేల మందిని తొలగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ మెయిల్స్ పంపింది. మరో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేల నుండి 15 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి కాగ్నిజెంట్ సిద్ధమైంది. కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల్లో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కోత ప్రభావం అత్యధికంగా మన దేశంపైనే పడే అవకాశం ఉంది. దాదాపు 13 వేల మంది భారతీయ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications