ఆర్థిక మాద్యం భయంతో ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటనతో ఉద్యోగులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. బోనస్ జీతానికి సమానంగానో లేక కాస్త ఎక్కువగానే లేక కాస్త తక్కువగానో ఉంటుంది. కానీ ఈ కంపెనీ కోటికి దగ్గర బోనస్ ఇచ్చింది.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. క్రిస్మస్‌కు బోనస్‌గా 80 లక్షల రూపాయలు.
ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన రాయ్ హిల్‌ను గినా రైన్‌హార్ట్ అనే మహిళ నడుపుతోంది. గత కొన్నేళ్లుగా మంచి వృద్ధిని కనబరిచిన రాయ్ హిల్ కూడా గణనీయమైన లాభాలను ఇచ్చింది. ఇదిలా ఉంటే, గినా రైన్‌హార్ట్ తన 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 80 లక్షల రూపాయల బోనస్ ఇచ్చింది.

క్రిస్మస్, న్యూ ఇయర్
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రకటన రావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 10 మందిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరారు. ఈ మహిళా పారిశ్రామికవేత్త 10 మంది ఉద్యోగులకు లక్షల రూపాయలను అందజేసింది. గత సంవత్సరాల కాలంలో రాయ్ హిల్ కంపెనీ 3.3 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

దిగ్గజ కంపెనీలు
యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, సిస్కో వంటి ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు మందగమనాన్ని పేర్కొంటూ ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. చాలా కంపెనీలు కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసాయి, అయితే రాయ్ హిల్ ఉద్యోగులకు బోనస్‌లను ఇవ్వడం అందరిని ఆశ్చర్య పరిచింది.

కార్లు
రెండు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు నగల షాపు వ్యాపారి పేరు జయంతి లాల్ చయంతి తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చారు. చెన్నై మహానగరంలో ప్రముఖ జ్యువెలరీ షాపు చలానీ జ్యువెలరీస్ అధినేతే జయంతి లాల్ చయంతి... దీపావళి సందర్భంగా తన షోరూంలో పని చేస్తున్న ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములకు పండుగ కానుకలు ఇచ్చారు. కోటి 20లక్షల రూపాయల విలువ చేసే కార్లు, బైక్‌లను కొనుగోలు చేసి తన షాపులో పని చేస్తున్న ఉద్యోగులకు పండుగ బహుమతిగా అందజేశారు. దీపావళి పండుగకు ఇంత ఖర్చు చేసి కార్లు, బైక్‌లను ఉద్యోగులకు అందజేయడం వెనుక ఎలాంటి వ్యాపార స్వార్ధం లేదని చెప్పారు.More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications