America-Iran: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా.. తగ్గనున్న చమురు ధరలు..!

అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ లో చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చర్చల్లో భాగంగా ఇరాన్ లో అణు తనిఖీలు, హార్ముజ్ జల సంధి గుండా స్వేచ్ఛా రవాణాపై మాట్లాడుకున్నారు. అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేయగా.. ఇరాన్ కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇరాన్ తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తి వేయాలని కోరింది. దీనికి అమెరికా సానుకూలంగా స్పందించింది. అమెరికా ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సోమవారం పాక్షికంగా ఎత్తివేసింది. ఇరాన్ పై విధించిన ఆంక్షలను 66 రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది.

ఇందుకు సంబంధించి అమెరికా ట్రెజరీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ ఆగస్ట్ 21 వరకు ముడి చమురు, పెట్రోకెమికల్, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ ఆంక్షల ఎత్తివేత జూన్ 17న అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 60 రోజుల ఒప్పందంలో భాగమని తెలుస్తోంది. ఇరాన్ పై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో టెహ్రాన్ ఇక నుంచి స్వేచ్ఛాగా చమురును విక్రయించుకోవచ్చు. ఇరాన్ చమురులో మార్కెట్లోకి వస్తే చమురు ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ దేశాలకు మంచి పరిణామంగా చెప్పొచ్చు.

Iran Crude Oil

ఇరాన్ చమురు అమ్మకం, డెలివరీ లేదా అన్‌లోడింగ్‌ను పూర్తి చేయడానికి అవసరమైనప్పుడు దానిని యునైటెడ్ స్టేట్స్‌లోకి దిగుమతి చేసుకోవచ్చని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. 1979లో దేసంలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోలేదు. స్విట్జర్లాండ్ లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలకు ప్రకారం హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత రవాణాకు ఇరాన్ అంగీకరించినట్లు బెస్సెంట్ తెలిపారు. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) ఇన్‌స్పెక్టర్లను తమ దేశంలోకి అనుమతించడానికి ఇరాన్ అంగీకరించిట్లు చెప్పారు.

చర్చల్లో భాగంగా ఇరాన్ చమురు ఉత్పత్తి, డెలివరీ, అమ్మకానికి అధికారం ఇస్తూ ట్రెజరీ 60 రోజుల తాత్కాలిక సాధారణ లైసెన్స్‌ను జారీ చేసిందని పేర్కొన్నారు. కాగా 2019 వరకు దక్షిణ కొరియా, జపాన్, గ్రీస్, తైవాన్, ఇటలీ, టర్కీతో పాటు భారతదేశం కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేది. అయితే ఇరాన్ ముడి చమురు దిగుమతిని నిషేధిస్తూ అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ దేశాలన్ని దిగుమతిని నిలిపివేశాయి. 2009 వరకు ఇండియా దిగుమతి చేసుకునే చమురులో ఇరాన్ ముడి చమురు వాటా దాదాపు 14 శాతంగా ఉండేది. అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ ఇరాన్ నుంచి దిగుమతిని నిలిపివేశాయి.

ప్రస్తుతం ఇండియా రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటుంది. జూన్ నెలలోనే న్యూఢిల్లీ మాస్కో నుంచి రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+