ప్రతిరోజు ప్రతి ఇంట్లో పాలు అనేది అందరు ఉపయోగించేది. అయితే పసి పిల్లల నుండి ప్రతి ఒక్క వ్యక్తి వరకు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలంటిది తాజాగా అమూల్ పాల ధరలు సవరించింది. దింతో ప్రస్తుతం అముల్ పాలు కొనడానికి మరో 2 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అవును, మదర్ డెయిరీ తర్వాత అమూల్ కంపెనీ కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచింది. మదర్ డెయిరీ ఏప్రిల్ 30 నుండి పాల ధరలను లీటరుకు రూ.2 సవరించింది ఇంకా మే 1 నుండి కొత్త అముల్ పాల ధరలు అమల్లో ఉంటాయి.

అమూల్ బ్రాండ్ పాలను విక్రయించే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), కంపెనీ పాల కొత్త ధరలు గురువారం అంటే 1 మే 2025 నుండి వర్తిస్తాయని తెలిపింది. మదర్ డెయిరీ కూడా బుధవారం పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, కొత్త ధరలు ఈరోజు మే 1 నుండి అమల్లోకి రానున్నాయి, అయితే కంపెనీ పాల ధరను ఎందుకు పెంచింది? దీనికి కంపెనీ కారణం ఎం చెబుతుందని అనే దాని పై వివరణ కూడా ఇచ్చింది.
అందుకే పాల ధర పెరిగింది: ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా ఉత్తరాఖండ్, తెలంగాణ మార్కెట్లలో అముల్ పాల కొత్త ధరలు ప్రస్తుతం వర్తిస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల పాల ధరలు పెంచినట్లు పేర్కొంది. గత ఏడాది కూడా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయి, దీని వలన పాల ధరలు పెరగాల్సి వచ్చింది. ఈసారి సమ్మర్ కాలం ముందుగానే ప్రారంభమైంది దింతో వేడిగాలులు కూడా మొదలయ్యాయి, ఈ కారణంగా పాడి పాల ఉత్పత్తి తగ్గడం ప్రారంభమైంది.
ప్రస్తుతం లీటరు పాల ధర ఎంతకు అమ్ముతున్నారంటే :ఈ రోజు మే 1 నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత అముల్ స్టాండర్డ్, అముల్ బఫెలో మిల్క్, అముల్ గోల్డ్, అముల్ స్లిమ్ & ట్రిమ్, అముల్ చాయ్ మజా, అముల్ తాజా అలాగే అముల్ కౌ మిల్క్ ధరలు రూ.2 పెరిగాయి. నేటి నుండి అముల్ ఫుల్ క్రీమ్ పాల ధర లీటరుకు రూ.65 నుండి రూ.67కి పెరిగింది. బల్క్-వెండెడ్ పాలు (టోన్డ్) ధర లీటరుకు రూ.53 నుండి రూ.55కి పెరిగింది. 500 మి.లీ. అముల్ గోల్డ్ ప్యాకెట్ ఇప్పుడు రూ.34కి లభిస్తుంది. అముల్ శక్తి స్టాండర్డ్ 500 మి.లీ. ప్యాకెట్ ఇప్పుడు రూ.31కి లభిస్తుంది.


Click it and Unblock the Notifications