Amul Chittoor Dairy: దేశంలోనే అతిపెద్ద డెయిరీగా ఉన్న అమూల్ తాజాగా ఏపీలో భారీ పెట్టుబడిని ప్రకటించింది. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చాయి.
రెండు దశాబ్దాల కిందట మూతపడిన దేశంలోనే ఇతిపెద్ద డెయిరీని తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. పాడి రైతుల కోసం డెయిరీని పునరుద్ధరించే క్రమంలో యాజమాన్య బాధ్యతలు అమూల్ కి అప్పగించారు. దీంతో అమూల్ ఈ ప్రాజెక్టులో రూ.385 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది.

డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులు చెల్లించి పునరుద్ధరణకు అమూల్ సంస్థతో ఒప్పందం కుదిరింది. పునరుద్ధరణ తర్వాత జున్ను, వెన్న, ఐస్‌క్రీమ్స్ మొదలైన పాల ఉత్పత్తులను కంపెనీ విక్రయించనుంది. సొంత డెయిరీ హెరిటేజ్ ప్రయోజనాల కోసం అప్పట్లో చిత్తూరు డెయిరీ మూతపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. డెయిరీ క్రమంగా నష్టపోయేలా చూడాలని నాయుడు ప్రయత్నించారని ఆరోపించారు.
99 ఏళ్లకు లీజు ప్రాతిపథికన చిత్తూరుకు చెందిన విజయ డెయిరీని గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న అమూల్‌కు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది. మెుదటి దశలో రూ.150 కోట్ల పెట్టుబడితో ఐస్‌క్రీం ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. 10 నెలల్లో పాత ప్రాసెసింగ్ ప్రారంభం కానుందని సీఎం తెలిపారు. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా అమూల్ డెయిరీ నిర్వహించడం వల్ల 5 వేల మందికి ఉపాధి లభించటంతో పాటు, లక్షలాది మంది పాడి రైతులకు సాధికారత చేకూరనుంది.
చిత్తూరు జిల్లాలో సహకార డెయిరీ చరిత్ర 1945 నుంచి పాల సేకరణ కేంద్రంగా స్థాపించబడింది. 1969లో డెయిరీ 6,000 లీటర్ల సేకరణతో సహకార కర్మాగారంగా మారింది. ఆ తర్వాత 1988లో విజయ డెయిరీ పేరుతో యూనిట్ తన వ్యాపారాన్ని 2.5 లక్షల లీటర్లకు విస్తరించింది. ఆ తర్వాత ప్రైవేట్ డెయిరీల ప్రవేశంతో 1990ల మధ్య భారీ నష్టాలకు గురై చివరికి మూతపడింది. అలా నాలుగు దశాబ్ధాల డెయిరీ ఘన చరిత్ర ముగిసి.. మళ్లీ ఇప్పుడు తిరిగి పునరుద్ధరణకు నోచుకుంది.


Click it and Unblock the Notifications