ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 9) వరుసగా 7వ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ అండతో మార్కెట్ దుమ్మురేపింది. సెన్సెక్స్ 326.82 పాయింట్లు(0.81%) లాభపడి 40,509.49 వద్ద, నిఫ్టీ 79.60 పాయింట్లు(0.67%) ఎగిసి 11,914.20 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1,216 షేర్లు లాభాల్లో, 1,426 షేర్లు నష్టాల్లో ముగియగా, 164 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
ఉదయం సెన్సెక్స్ 103పాయింట్లు, నిఫ్టీ 34పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోను నష్టాల్లోకి వెళ్లలేదు. సెన్సెక్స్ ఓ సమయంలో 40,550 పాయింట్ల సమీపానికి చేరుకుంది. మధ్యాహ్నం కాస్త ఒత్తిడికి లోనైనప్పటికీ లాభాల్లోనే కొనసాగింది. చివరి గంటలో తిరిగి పుంజుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగా మినహా అన్ని రంగాలు భారీ లాభాల్లో ముగిశాయి.

బ్యాంకింగ్ అదుర్స్, ఆటో బేజారు
స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ రోజు లాభాల్లో ముగిశాయి.
నిఫ్టీ బ్యాంకు 2.8 శాతం లాభపడింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 1.8 శాతం ఎగిసింది. నిఫ్టీ ఐటీ 0.6 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.6 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 1.3 శాతం క్షీణించింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్ కూడా భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.
సెప్టెంబర్ సేల్స్ సానుకూలంగా ఉండటంతో నిన్నటి వరకు పెరిగిన ఆటో స్టాక్స్ ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి. టాప్ 5 గెయినర్స్‌లో నాలుగు బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో గ్రాసీమ్, హిండాల్కో, యూపీఎల్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి.
ఈరోజు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, రిలయన్స్ ఉన్నాయి.

దుమ్మురేపిన నిఫ్టీ బ్యాంక్
మార్కెట్ జూమ్ ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు దోహదపడింది. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ 3.68 శాతం, HDFC షేర్ ధర 0.86 శాతం, HDFC బ్యాంకు షేర్ 3.64 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ 4.06 శాతం, యాక్సిస్ బ్యాంకు షేర్ ధర 3.74 శాతం, కొటక్ బ్యాంకు షేర్ ధర 0.14 శాతం, బంధన్ బ్యాంకు షేర్ ధర 2.09 శాతం లాభపడ్డాయి.
ఐటీ స్టాక్స్ కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. టీసీఎస్ షేర్ ధర 0.52 క్షీణించి రూ.2,811కు తగ్గింది. టెక్ మహీంద్ర షేర్ 0.50 శాతం క్షీణించింది.
హెచ్‌సీఎల్ టెక్ షేర్ 0.88 శాతం, ఇన్ఫోసిస్ షేర్ 1.60 శాతం, విప్రో షేర్ ధర ఏకంగా 4.40 శాతం లాభపడింది. మైండ్ ట్రీ షేర్ 3.82 శాతం, కోఫోర్జ్ 0.11 శాతం లాభపడింది.

మార్కెట్ లాభాలకు కారణాలు
అందరి అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్య లభ్యతను పెంచేందుకు కూడా చర్యలు చేపట్టింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఉదయం మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆర్బీఐ ప్రకటన తర్వాత భారీ లాభాల్లోకి వచ్చాయి. ప్రధానంగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడంతో బ్యాంకింగ్ షేర్లు పుంజుకున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications