Sectoral mutual funds: సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్లలో డిఫెన్స్ టాప్.. ఐటీ లాస్ట్..!
సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు, గత రెండేళ్లుగా వివిధ రంగాలు ఎలా పనిచేశాయో పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వివిధ విభాగాలలో రాబడులు గణనీయంగా మారుతూ వచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL) తన తాజా ఇండియా స్ట్రాటజీ నివేదికలో వివిధ రంగాలలో గణనీయమైన వ్యత్యాసం ఉందని పేర్కొంది. వివిధ రంగాల పనితీరు గురించి పెట్టుబడిదారులు తెలుసుకోవలసిన విషయాలు, సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టేవారికి దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలని వివరించింది. సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్ల అంటే.. ఒక రంగానికి సంబంధించి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలి.
80 శాతం పెట్టుబడులు ఒకే రంగంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా రక్షణ, లోహాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల రంగాలు కీలకమైన అత్యుత్తమ పనితీరును కనబరచగా, టెక్నాలజీ, వినియోగదారు, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాలు వెనుకబడ్డాయి. ప్రధానంగా మార్కెట్లు బాగా రాణించనప్పటికీ, నిర్దిష్ట రంగాలు బాగా రాణించగలవని ఈ డేటా స్పష్టంగా కనిపిస్తుందని ఓమ్నిసైన్స్ క్యాపిటల్ సీఈఓ & స్ట్రాటజిస్ట్ వికాస్ గుప్తా అన్నారు. గత రెండేళ్లుగా డిఫెన్స్ సెక్టార్ 19 శాతం రాబడి ఇచ్చింది. మెటల్ 14 శాతం, పీఎస్‌యూ బ్యాంకులు 10 శాతం, ఆరోగ్య సంరక్షణ 7 శాతం, మూలధన వస్తువులు 2 శాతం, బ్యాంకులు 1 శాతం, ఆర్థిక సేవలు 0 శాతం, ఆటోమొబైల్స్ -1 శాతం, మౌలిక సదుపాయాలు -4 శాతం, వినియోగం -6 శాతం, ఎనర్జీ -8 శాతం, రియల్ ఎస్టేట్ -12 శాతం, మీడియా -15 శాతం, వినియోగదారు -17 శాతం, టెక్నాలజీ -18 శాతం రాబడి ఇచ్చాయి.

ఐటీ రంగం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఐటీ ఎక్కువగా లాభాలు వచ్చేవని.. ఇప్పుడు ఏఐ వల్ల పరిస్థితి మారిపోయిందని వివరిస్తున్నారు. గత మూడేళ్లలో ఎస్బీఐ టెక్నాలజీ అపర్చునిటీ ఫండ్ -1.25 శాతం, టాటా నిఫ్టీ ఇండియా డిజిటల్ ఈటీఎఫ్ -1.4 శాతం, యాక్సెస్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ -13 శాతం రాబడి ఇచ్చింది. హెచ్ డీఎఫ్ సీ డిఫెన్స్ ఫండ్ గత మూడేళ్లలో 38 శాతం, సంవత్సరంలో 23 శాతం రాబడి ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఫండ్ సంవత్సరంలో 15 శాతం రాబడి ఇచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఫండ్ సంవత్సరంలో 15 శాతం రాబడి ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
