IPO News: ఇన్వెస్టర్లు ఎగబడి కొంటున్న ఐపీవో.. తొలిరోజే 100% సబ్‌స్క్రిప్షన్.. కొంటున్నారా..
Amkay Products IPO: మే నెల మెుదలవగానే ఐపీవో మార్కెట్లో మళ్లీ హడావిడి మెుదలైంది. కొత్త ఐపీవోల రాకతో ఇన్వెస్టర్లు సైతం బిజీబిజీగా కొనసాగుతున్నారు. తమ డబ్బును ఐపీవోల్లో బెట్టింగ్ వేయటం ద్వారా తక్కువ సమయంలో మంచి లాభాలను పొందాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికోసం ఒక ఐపీవో మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆమ్కే ప్రొడక్ట్స్ కంపెనీ ఐపీవో గురించే. ఇన్వెస్టర్లు పందెం వేసేందుకు ఐపీవోలో ఇప్పటికీ అవకాశం అందిస్తోంది. ఈ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఇన్వెస్టరు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తొలిరోజే రిటైలర్లు ఎగబడటంతో 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తైంది. అయితే బెట్టింగ్ వేయాలనుకునే వారికి మరో రెండు రోజులు అవకాశం అందుబాటులో ఉంది. అలాగే ఐపీవో పనితీరు గ్రేమార్కెట్లో సైతం అద్భుతంగా ఉంది.

ఐపీవో ఇష్యూ కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.52 నుంచి రూ.55గా నిర్ణయించింది. ఏప్రిల్ 30న ప్రారంభమైన ఐపీవో ఏప్రిల్ 3న ముగియనుంది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని కంపెనీ 2000 షేర్లుగా నిర్ణయించింది. అంటే ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.1,10,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఆమ్కే ప్రొడక్ట్స్ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.12.61 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం 22.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. BSE SME కేటగిరీలో 8 మే 2024న లిస్టింగ్ కానుంది.
గురువారం గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై రూ.45 ప్రీమియం ధర కొనసాగుతోంది. ఈ లెక్కన జాబితా అయ్యే సమయంలో ఇదే కొనసాగితే షేరు రూ.100 రేటు వద్ద మార్కెట్లోకి అడుగుపెడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఐపీవో తొలిరోజు జాబితా కాగానే పెట్టుబడిపై 81.82 శాతం లాభాన్ని ఆర్జిస్తారు.
కంపెనీ ఐపీవో మొదటి రోజునే 35.18 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. రిటైల్ కేటగిరీలో ఏప్రిల్ 30న ఐపీవో 54.14 సార్లు సబ్‌స్క్రైబ్ అందుకుంది. అలాగే అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగం 0.06 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 37.60 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందటంతో మార్కెట్లో ఐపీవో ట్రెండింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications