Adani: నిర్ధోషిత్వాన్ని నిరూపించుకనే పనిలో అదానీ.. స్పందించిన అమిత్ షా.. డబ్బుకోసం చక్కర్లు..
Adani Companies: హిండెన్ బెర్గ్ కల్లోలం నుంచి గ్రూప్ కంపెనీలను కాపాడటంతో పాటు, రిపోర్టులోని ఆరోపణలు అవాస్తవమని నిరూపించాలని గౌతమ్ అదానీ ప్రయత్నిస్తున్నారు. దీనికోసం గతంలో అమెరికా న్యాయసేవల సంస్థను నియమించుకున్నారు.తాజాగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత అకౌంటింగ్ సంస్థ గ్రాండ్ థోర్న్‌టన్‌ను ఆడిట్ కోసం నియమించుకున్నారు.

స్వతంత్ర ఆడిట్..
ఆఫ్‌షోర్ టాక్స్ హెవెన్‌లను సక్రమంగా ఉపయోగించలేదని రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలను అవాస్తవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. అందుకే గ్రూప్ లోని కొన్ని కంపెనీల అకౌంట్లను ఇండిపెండెంట్ ఆడిట్ కోసం అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థను నియమించింది. స్టాక్ ధరల మ్యానిపులేషన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన తర్వాత అదానీ గ్రూప్ వాస్తవాలను స్టేక్ హోల్డర్లకు తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఆడిట్ ఇలా..
అదానీ గ్రూప్‌లో సంబంధిత పార్టీ లావాదేవీలు కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో గ్రాంట్ థోర్న్‌టన్ పరిశీలించనుంది. కంపెనీ ఈ ప్రయత్నాల ద్వారా వ్యాపార నిర్వహణ పరంగా బలంగా ఉన్నట్లు పెట్టుబడిదారులకు తెలపాలని చూస్తోంది. గత నెల 24 నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూప్ హిండెన్ బెర్గ్ రిపోర్ట్ కారణంగా దాదాపు 120 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది.
హోం మంత్రి అమిత్ షా..
ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేస్తుండగా.. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా బదులిచ్చారు. అదానీ విషయంలో దాయటానికి కానీ లేదా బయపడటానికి కానీ ఏమీ లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో నేడు అదానీ కంపెనీల్లో కీలకమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. అయితే స్టాక్ మాత్రం నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

డబ్బుల కోసం తిప్పలు..
అదానీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కోసం అబుదాబి ఇంక్‌ని ఆశ్రయించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లేదా ఇతర గ్రూప్ ఎంటిటీలలోకి క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కోసం అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కార్ప్ (IHC)తో అదానీ గ్రూప్ గత వారం నుంచి చర్చలు జరుపుతోందని అంతర్గత సమాచారం. తదుపరి చర్చల కోసం అదానీ గ్రూప్ ప్రతినిధులు సోమవారం అబుదాబికి వెళ్లినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications