Kaun Banega Croreathi 16: DTH, OTTలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో 'గేమ్ షో'లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఓ పక్కన నిర్మాణ సంస్థలు వెంటపడుతున్నాయి. వీటికి హోస్ట్‌గా వ్యవహరించి పలువురు హీరోలు భారీ రెన్యుమరేషన్ తీసుకుంటున్నారు. బిగ్ బాస్ వంటి షోలు పలు భాషల్లో ప్రసారం అవుతుండగా.. తెలుగు సహా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ 'గేమ్ షో'లు అన్నింటిలో 'కౌన్ బనెగా కరోడ్ పతి' ఎంతో ప్రఖ్యాతిగాంచింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దీనికి హోస్టుగా వ్యవహరించారు. ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ ప్రోగ్రాం.. సరికొత్తగా 16 సీజన్ ప్రారంభించనుంది. దీనికోసం మరోసారి అమితాబ్ వ్యాఖ్యాత అవతారం ఎత్తనున్నారు. ఇందుకుగాను ఆయన తీసుకుంటున్న పారితోషకం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.

2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ షోలో మొదటి ఎపిసోడ్ కు 25 లక్షలు చొప్పున అమితాబ్‌కు నిర్వాహకులు చెల్లించారని నివేదికలు చెబుతున్నాయి. నాలుగవ సీజన్ వచ్చేసరికి అధి కాస్తా డబుల్ అయ్యి 50 లక్షల పెరిగిందట. అనంతరం ప్రతి 2 సీజన్లకు భారీగా పెరుగుతూ పోయింది. పదో సీజన్ నాటికి ఎపిసోడ్ కు 3 కోట్లు చొప్పున బిగ్ బి కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక చివరి సీజన్లో 4 నుంచి 5 కోట్ల మధ్య తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక త్వరలో ప్రారంభంకాలన్న 16వ సీజన్‌లో ఈ మొత్తం 5 కోట్లకు పైగా చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
80 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూ అమితాబ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో బిగ్ బి పాత్ర సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క గేమ్స్ ద్వారానూ పెద్ద మొత్తంలో ఆర్ధిస్తున్నారు. ఏదేమైనా మరోసారి తమ ఫేవరెట్ గేమ్ మొదలుకావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ హోస్టింగును ఎంజాయ్ చేయొచ్చని ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications