Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలో రూ.65..!
ఉల్లి ధర ఘాటెక్కింది. గత నెల రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. అధికారిక లక్కల ప్రకారం ఉల్లి సగటు చిల్లర ధర కిలోకు సుమారు రూ. 42కి పెరిగింది. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 45 శాతం ఎక్కవ. ఇక నెల రోజుల క్రితంతో పోలిస్తే సుమారు 19 శాతం అధికం. ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (ఆగస్టు 24) నుంచి నాసిక్ నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి వంటి ప్రధాన వినియోగ కేంద్రాలకు ఉల్లిపాయలను తీసుకువెళ్లే ప్రత్యేక రైళ్లను నడపడం ప్రారంభించింది. ఈ సర్వీసుకు 'కాండా ఎక్స్‌ప్రెస్' అని పేరు పెట్టారు. సరఫరా అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి ధరలు విపరీతంగా పెరిగిన నగరాలకు ఉల్లిపాయలను తరలించడమే దీని ఉద్దేశం.
ఉల్లి ఉత్పత్తి తగ్గడం, సరఫరా కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో కిలో ధర సుమారు రూ. 65 ఉండగా, చెన్నైలో సుమారు రూ. 58గా ఉన్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో కిలో ఉల్లి రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. ఉల్లి దాదాపు అన్ని కూరల్లో వేస్తారు. దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఉల్లి దాదాపు ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నప్పుడు, ధరల పెరుగుదల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల ధరల పెరుగుదల తీవ్రతరం కాకముందే సరఫరాలను మెరుగుపరచాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకే బఫర్ నిల్వలు విడుదల చేస్తోంది. కేంద్రం తన బఫర్ నిల్వల నుంచి ఉల్లి మార్కెట్లోకి విడుదల చేయాలని కూడా చూస్తోంది. నివేదికల ప్రకారం చిల్లర ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిల్వలను విడుదల చేయడం ప్రారంభించవచ్చు. ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఒక ఆసరాగా పనిచేయడానికే బఫర్ నిల్వ ఉంచుతారు. కొత్త సరఫరాలు వచ్చే వరకు వేచి ఉండకుండా, కొరతను ఎదుర్కొంటున్న మార్కెట్లలోకి ప్రభుత్వం నిల్వ ఉన్న ఉల్లిపాయలను విడుదల చేస్తారు.
బఫర్ కోసం సేకరణను కూడా కేంద్రం బలోపేతం చేస్తోంది. జూలైలో ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటాల్‌కు రూ. 1,875 నుంచి రూ. 2,125కు, అంటే 13 శాతం పెంచింది. ఈ చర్య బఫర్ సేకరణకు మద్దతు ఇస్తూనే రైతులకు మెరుగైన రాబడిని ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్న నగరాల్లో సరఫరా ఒత్తిడిని తగ్గించడమే తక్షణ లక్ష్యమని కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తి ప్రాంతాల నుంచి వినియోగ మార్కెట్లకు ఎక్కువ పరిమాణంలో ఉల్లి తరలించడానికి రైలు రవాణా ఉపయోగపడనుంది. ఉల్లితో పాటు వంట నూనెల ధరలు కూడా అధికంగానే ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications