రియల్ ఎస్టేట్ రంగానికి ఏమైంది.. పడిపోతున్న హైదరాబద్, బెంగుళూరు ఇళ్ల అమ్మకాలు.. కారణం ఏంటి..?

ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి అని లేదా ఒక మంచి ఇల్లు కొనుకోవాలని ఉంటుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో భూమి ధరలు అలాగే ఇళ్ల ధరలు రియల్ ఎస్టేట్ రంగంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఏ నగరం అయినా, ఎలాంటి ప్రదేశం అయినా అక్కడ ఉండే ల్యాండ్ వాల్యూ ఇంకా వసతులు, సౌకర్యాలు బట్టి మారుతుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందుకు చాల కారణాలు ఉండొచ్చు. కానీ రాజకీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ల ప్రభావం పెట్టుబడిదారులపై కూడా ఉంటుంది. అందుకే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే హౌసింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది. అందుకే ఈ కాలంలో ఇళ్ల అమ్మకాలు 28 శాతం తగ్గాయి.

Amidst skyrocketing prices of houses in hyderabad and banglore sales have fallen this year from jan know how much in which city

భారీగా పెరుగుతున్న ఇళ్ల ధరలు అండ్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2025 మొదటి త్రైమాసికంలో భారత హోసింగ్ మార్కెట్ బూమ్ మందగించిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఈ కారణంగా ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు దాదాపు 93,280 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో పోల్చి చూస్తే 1,30,170 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సంవత్సరం 28% తగ్గుదల కనిపిస్తోంది.

ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 20% తగ్గిన అమ్మకాలు: దేశ రాజధాని నగరం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అమ్మకాలు చూస్తే 20% తగ్గాయి. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇక్కడ దాదాపు 12,520 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే కాలంలో 15,650 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో రెసిడెన్షియల్ ఆస్తుల అమ్మకాలు 26% తగ్గి, ఈ సంవత్సరం చూస్తే దాదాపు 31,610 యూనిట్లు అమ్ముడవగా, గత సంవత్సరం 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి.

బెంగళూరు-హైదరాబాద్‌లో కూడా తగ్గిన అమ్మకాలు: ఇదే కాలంలో బెంగళూరులో కూడా ఇళ్ల అమ్మకాలు 16% తగ్గాయి. ఈ సంవత్సరం దాదాపు 15,000 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉండగా, గత సంవత్సరం 17,790 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. పూణేలో కూడా అమ్మకాలు 30% వరకు తగ్గవచ్చు. గత ఏడాది 22,990 యూనిట్లు అమ్ముడవగా, ప్రస్తుతం అమ్మకాలు 16,100 యూనిట్లుగా ఉంటాయని అంచనా.

ఇక హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు చూస్తే 49% తగ్గవచ్చు. గత ఏడాది 19,660 యూనిట్లు అమ్ముడైతే, ఈసారి 10,100 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. చెన్నైలో అమ్మకాలు కూడా 26% తగ్గవచ్చు. దీని బట్టి చూస్తే గత ఏడాది 5,510 యూనిట్లు అమ్ముడైతే, ఈసారి 4,050 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో కోల్‌కతాలో రెసిడెన్షియల్ ఆస్తుల అమ్మకాలు 31% తగ్గవచ్చు. అయితే గత ఏడాది ఇదే సమయంలో 5,650 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 3,900 యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి భారతదేశ మొత్తం ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. GDP వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉంటుందని ఇంకా ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ, ఇళ్ల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే, పెరుగుతున్న ఇళ్ల ధరలు అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి ప్రపంచ అంశాలు భారతదేశ హోసింగ్ మార్కెట్ కార్యకలాపాలను ప్రభావితం చేశాయి అని ఆయన అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+