Investors: భారత మార్కెట్ల వైపు కదులుతున్న పెట్టుబడిదారులు..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ విప్లవం కొనసాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఏఐ పై పని చేసే కంపెనీల డిమాండ్ భారీగా పెరిగింది. ఏఐ కంపెనీల స్టాక్స్ భారీగా పెరిగాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోని ర్యాలీ బలహీనపడటం ప్రారంభమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత మార్కెట్ల వైపు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఆసియా నుంచి అమెరికా వరకు బెంచ్‌మార్క్ సూచీలను కదిలిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారులకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీని ఒకరకమైన సురక్షితమైనదిగా మారినట్లు చెబుతున్నారు.
దేశంలోని కంపెనీలో ఏఐ అంత ఫాస్ట్ గా పని చేయలేదు. దీంతో ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్ రంగంలో విదేశి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టలేకపోయారు. అందుకే చాలా మంది మంచి రాబడులు వచ్చే దక్షిణ కొరియా, తైవాన్ వంటి మార్కెట్ల వైపు వెళ్లారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత మార్కెట్లు పెట్టుబడిదారులను ఆకర్షించలేకపోయాయి. అదే సమయంలో మార్కెట్లు తక్కువ శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీ కంటే తక్కువ. అలాగే S&P 500 సూచీ కంటే కొద్దిగా ఎక్కువ. జూన్ లో నిఫ్టీ 50 సూచీ నవంబర్ తర్వాత అత్యధికంగా MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీని అధిగమించాయి.

ఇటీవల తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు భారత స్టాక్ మార్కెట్ల కంటే వెనుకబడ్డాయి. రెండు మార్కెట్లలోనూ వచ్చిన దిద్దుబాటు కారణంగా భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తమ ఐదో స్థానాన్ని తిరిగి పొందాయి. తైవాన్ 4.95 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో భారతదేశాన్ని వెనక్కి నెట్టిప్పటికీ భారత్ తిరిగి పుంజుకుంది. 77.96 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇరాన్ యుద్ధంతో ముడి చమురు ధర భారీగా పెరగడంతో ఇండియా మార్కెట్లు వెనకబడ్డాయి.
అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గాయి. దీంతో భారత మార్కెట్లు కూడా పెరగడం ప్రారంభించాయి. ఇదే స్థాయి కొనసాగించాలంటే కంపెనీలు మంచి పనితీరు కనబర్చాలి. అయితే ఏఐ విప్లవం నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు డీలా పడ్డాయి. ఐటీ ఇండెక్స్ భారీగా పడిపోయింది. టీసీఎస్, ఇన్పోసిస్,హెచ్ సీఎల్ టెక్ స్టాక్స్ పడిపోయాయి.


Click it and Unblock the Notifications