Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఆటో, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్లు లాభపడగా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడగా మరో కీలక సూచీ నిఫ్టీ 21 పాయింట్ల మేర పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 93 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 261 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో మిడ్ క్యాప్ సూచీ 0.3 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ రంగాలు మినహా నేడు అన్ని రంగాలు లాభాల్లో ముగింపును చూశాయి.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, గ్రాసిమ్, సన్ ఫార్మా, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, హిందాల్కొ, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, విప్రో, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications