Closing Bell: ఉదయం భారీ లాభాలతో మెుదలై రికార్డు గరిష్ఠాలను తాకిన బెంచ్ మార్క్ సూచీలు తర్వాత ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో ముందుకు సాగినప్పటికీ చివరికి స్వల్ప లాభాలతో ఫ్లాట్ ముగింపును చూశాయి.
ఈ క్రమంలో మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 23 పాయింట్ల లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 1 పాయింట్ లాభంతో ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 110 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 594 పాయింట్ల మేర లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. మార్కెట్లు భారీ ఓలటాలిటీలో కొనసాగినప్పటికీ మీడియా, రియల్టీ రంగాల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని కొనసాగించాయి. అలాగే ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లు నష్టాలను చూశాయి.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, బ్రిటానియా, మారుతీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎయిర్ టెల్, టైటాన్, సిప్లా, ఐటీసీ, టాటా కన్జూమర్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, నెస్లే, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications