Market Opening: నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్ ప్రారంభాన్ని చూశాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా స్టాక్ మార్కెట్లు బేర్ ట్రెండ్ కొనసాగించటమేనని తెలుస్తోంది. వాస్తవానికి టెక్ స్టాక్ ఎన్వీడియా ముఖ్యంగా బలమైన ఆదాయాలు ఉన్నప్పటికీ ఇటీవలి క్షీణత, ఈ జాగ్రత్తకు దారితీసింది. దీనికి తోడుఫెడ్ రేటు తగ్గింపుకు సంబంధించిన చిక్కులు సైతం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా ఉంది.
ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభాలను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 42 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 35 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో బ్లాక్ డీల్స్ వివరాలను పరిశీలిస్తే.. ఏవియేషన్ కంపెనీ ఇండిగో ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ 6 శాతం వాటాలను రూ.11,000 కోట్లకు విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో నేడు కంపెనీకి సంబంధించిన షేర్లు మార్కెట్లో ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో సిప్లా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, నెస్లే, దివీ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, ఎల్‌టిఐఎమ్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications