Who really buys Russian oil in India? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ భారత్ మీద బెదిరింపులకు దిగారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించుకోకపోతే 25 శాతం అదనపు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే భారతీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి మన దేశంలో చమురును ఎవరు కొనుగోలు చేస్తున్నారు. ఏయే కంపెనీలకు అది వెళుతోంది అనే అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. భారతదేశం రష్యా చమురును ఎలా దిగుమతి చేస్తోంది ఈ కథనంలో ఓ సారి చూద్దాం.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రారంభమైన అంతర్జాతీయ ఉద్రిక్తతలు చమురు వర్తకాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అతి పెద్ద దిగుమతిదారైన భారత్ మీద దీని ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో 2022లో రష్యా నుంచి తీసుకునే చమురు వాటాను కేవలం 0.2% నుంచి 2025 నాటికి 35-40% వరకు పెంచింది. దీని వెనుక వ్యాపార నిర్ణయం మాత్రమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు, భద్రతా వ్యూహాలు, అంతర్జాతీయ దౌత్యం వంటి అంశాలు కలిసి ఉన్నాయి.
మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రష్యా నుంచి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారంగా ఉన్న జామ్‌నగర్ ఫెసిలిటీ ద్వారా రష్యన్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది జూలైలోనే 6.18 లక్షల బ్యారెళ్లు రోజుకు దిగుమతి చేసుకుంది. కంపెనీ మొత్తం దిగుమతుల్లో ఇది 57% కి పైగా ఉంది. రష్యా సంస్థ Rosneftతో దీర్ఘకాలిక ఒప్పందాలు కలిగిన RIL.. ప్రధానంగా యూరప్ మార్కెట్‌కి తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ఇక Rosneft మద్దతుతో నడుస్తున్న మరో భారత దిగ్గజం నయారా ఎనర్జీ కూడా భారత్‌లో రెండవ అతిపెద్ద ప్రైవేట్ శుద్ధిదారుగా ఉంది. 2.4 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును రోజూ అవసరాల కోసం వాడుతోంది. అయితే 2025 జూలై నెలలో యూరోపియన్ యూనియన్ ఆంక్షలతో నయారాకు నిర్వహణ సమస్యలు తలెత్తాయి. CEO రాజీనామా చేయడం..ఒత్తిడి భరించలేకపోవడమే దీనికి ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తొలుత రష్యన్ చమురును స్వీకరించినా, ఇటీవల US ఒత్తిడి కారణంగా తమ కొనుగోళ్లను తగ్గించాయి. IOC ఏకంగా రష్యా కొనుగోళ్లను పాజ్ చేసి, యుఎస్, కెనడా, యుఏఈల నుండి కొత్త డీల్స్‌కి మొగ్గుచూపింది.
రష్యన్ చమురుపై 2022లో లభించిన 15-20 డాలర్ల బ్యారెల్ తగ్గింపు కారణంగా భారత శుద్ధి కర్మాగారాలు మొత్తం 35 బిలియన్ డాలర్లను ఆదా చేశాయి. అయితే 2025 నాటికి ఈ తగ్గింపు కేవలం 2 బిలియన్ డాలర్లకు పరిమితం కావడంతో.. చాలా సంస్థలు తమ వ్యూహాలను పునః సమీక్షించాల్సి వచ్చింది.

రష్యను చమురును కొనుగోలు చేస్తున్న భారత కంపెనీల వివరాలు
ట్రంప్ నాయకత్వంలో అమెరికా భారత వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న హెచ్చరికలు భారత్ ను మళ్లీ ఆలోచనలో పడేశాయి. రష్యా చమురు ఎగుమతులపై యూరోప్ నిషేధాలు, చెల్లింపు విధానాలపై నియంత్రణలన్నీ కలిపి భారత కంపెనీలకు భారీ సవాళ్లుగా మారాయి.
ప్రస్తుతం రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ సరఫరాలపై కొనసాగుతున్నాయి. అయితే ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో కొత్త వనరుల వైపు దృష్టి సారించాయి. మధ్యప్రాచ్యం, యుఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి మార్కెట్లతో ఒప్పందాల కోసం రెడీ అవుతున్నాయి. ఇంధన భద్రత, వ్యాపార ప్రామాణికత, అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య సమతుల్యం సృష్టించడం.. భారత ప్రభుత్వానికి ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారింది. వచ్చే ఏడాది నుండి అమలులోకి వచ్చే EU నిషేధాలు, US పాలసీ మార్పులు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications