Gold Rate: శుభవార్త.. కుప్పకూలిన గోల్డ్ ధర, నేడు రూ.17,900 తగ్గిన పసిడి.. ట్రంప్ చలవే..
Gold Price Today: అమెరికా ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఆర్థిక వ్యవస్థల్లో స్థిరత్వానికి దారితీస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ గోల్డ్ నుంచి బాండ్ మార్కెట్లు, ఈక్విటీల్లోకి తమ డబ్బును తరలించటంతో బంగారం ధరలు రోజురోజుకూ కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాహాల సీజన్ కోసం షాపింగ్ చేయాలనుకునే వారు నేడు షాపులకు క్యూ కడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.16,500 భారీ పతనాన్ని నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7200, ముంబైలో రూ.7200, దిల్లీలో రూ.7125, కలకత్తాలో రూ.7200, బెంగళూరులో రూ.7200, కేరళలో రూ.7200, వడోదరలో రూ.7205, అహ్మదాబాదులో రూ.7205, జైపూరులో రూ.7215, లక్నోలో రూ.7215, మధురైలో రూ.7200, నాశిక్ లో రూ.7203, అయోధ్యలో రూ.7215, బళ్లారిలో రూ.7200, గురుగ్రాములో రూ.7215, నోయిడాలో రూ.7215 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.17,900 తగ్గింపును చూసింది. ట్రంప్ గెలుపుతో గోల్డ్ ధరలు భారీగా తగ్గటంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7856, ముంబైలో రూ.7856, దిల్లీలో రూ.7871, కలకత్తాలో రూ.7856, బెంగళూరులో రూ.7856, కేరళలో రూ.7856, వడోదరలో రూ.7861, అహ్మదాబాదులో రూ.7861, జైపూరులో రూ.7871, లక్నోలో రూ.7871, మధురైలో రూ.7856, నాశిక్ లో రూ.7859, అయోధ్యలో రూ.7871, బళ్లారిలో రూ.7856, గురుగ్రాములో రూ.7871, నోయిడాలో రూ.7871గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7856 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7856 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.3000 తగ్గి రూ.1,02,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications