Hyderabad Traffic: తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ చాలా కాలంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఐటీ నగరంగా పేరొందటంతో చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తారాస్థాయిలకు చేరాయి.
ఇక ప్రస్తుత వర్షాకాలంలో ఇది మరింత తీవ్రమవుతుంది. కిలోమీటరు వెళ్లాలంటే గంట సమయం పడుతుందని ప్రజలు తమ ట్రాఫిక్ ఇబ్బందులపై వాపోతున్నారు. సాధారణ రోజుల్లో సైతం రద్దీ ఎక్కువగానే ఉంటుందని వారు చెబుతున్నారు. దీనివల్ల అనేక ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్స్ సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రధానంగా నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ ట్రాఫిక్ రద్దీ అతిపెద్ద సమస్యగా మారి ప్రయాణికులను వేధిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు అనేక మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు.

వర్షాకాలంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అదనపు పోలీసులను విధుల్లోకి తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు అధ్వాన్నంగా ఉంటాయని, కానీ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వర్షం తగ్గగానే ఒకేసారి వాహనాలు అకస్మాత్తుగా రోడ్లపైకి రావటం ట్రాఫిక్ సమస్యలను జఠిలంగా చేస్తోందని చెప్పారు.
అలాగే హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లను తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పోలీసులు కేంద్రీకృత రవాణా వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 100 కంపెనీలు పనిచేస్తున్నాయి. మొత్తం 100 కంపెనీలు ఉద్యోగులను తీసుకురావడానికి ఇంచుమించుగా ఒకే సమయంలో వాహనాలను పంపుతాయి. దాన్ని అనుసంధానం చేసి బస్సు సర్వీసును అందించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. ఈ వ్యవస్థను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగులు కార్లలో వస్తుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కో కారులో రావటం పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చేలా చేస్తోంది. అందువల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్ షేరింగ్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వర్షం సమయంలో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవటమే వాహనాలు ఆలస్యంగా కదిలేందుకు కారణమని చాలా మంది ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సమయాల్లో కిలో మీటరు ప్రయాణానికి దాదాపు 30 నిమిషాలు పడుతుందని అందువల్ల ముందుగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ కంపెనీలకు వర్షాకాలంలో వీలైనంత వరకు ఇంటి నుండి పని చేసేలా ఉద్యోగులను ప్రోత్సహించడం వంటి ఆలోచనలను ముందుకు తీసుకొస్తోంది. లేని పక్షంలో ఉద్యోగుల పని సమయాలను మార్చేందుకు అవకాశాలను పరిశీలించాలని కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications