Lock Down: లాక్ డౌన్ విధిస్తున్న ఆ దేశం.. రాత్రి 9 గంటల తర్వాత షాపులు క్లోజ్..
అమెరికా, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో పలు దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. దాయాది దేశం పాక్ లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠినమైన పొదుపు చర్యలను చేపట్టింది. పెరుగుతున్న క్రూడ్ ధరలు, సరఫరా సమస్యల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యుత్, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్యాబినెట్ డివిజన్ సెప్టెంబర్ 17న అధికారికంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
పాకిస్థాన్ వ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకే మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వెడ్డింగ్ హాల్స్, ఇతర ఈవెంట్ వేదికలు రాత్రి 10 గంటల కల్లా బంద్ చేయాలి స్పష్టం చేసింది. ఇక రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్‌లెట్‌లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అయితే పార్శిల్, హోమ్ డెలివరీ సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు పాక్ అధికారులు తెలిపారు. పెళ్లిళ్లలో విందుకు కేవలం ఒక వంటకం మాత్రమే వడ్డించేలా పాక్ పరిమితి విధించింది. ప్రజలపైనే కాకుండా ప్రభుత్వ వ్యవస్థపైనా ఈ ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

ప్రభుత్వ శాఖల అధికారిక వాహనాల ఇంధన కోటాను 3 నెలల పాటు ఏకంగా 50 శాతం మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. ఫెడరల్ డిపార్ట్‌మెంట్లు కొత్త వెహికల్స్ కొనకుండా నిషేధం విధించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరికరాలు మినహా మిగిలిన డ్యూరబుల్ గూడ్స్ కొనుగోళ్లను బంద్ చేశారు. FY2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వేతర ఖర్చులను 5 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ రంగానికి, అత్యవసర సేవలకూ కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ.. పరిపాలనా వాహనాలకు ఇంధన కోత వర్తించనుంది. మంత్రులు, పార్లమెంటేరియన్ల విదేశీ పర్యటనలపై 3 నెలల పాటు ఆంక్షలు విధించారు.
సమావేశాల కోసం టెలికాన్ఫరెన్సింగ్ విధానాన్ని వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన క్రూడ్ రేట్లకు అనుగుణంగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను ఎప్పటికప్పుడప పెంచుతోంది. సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్ ధరను 43 పైసలు తగ్గించి లీటరుకు 390.79కి చేర్చగా, హై-స్పీడ్ డీజిల్ ధరను లీటరుకు 3.47 పెంచి 424.92 పాకిస్థానీ రూపాయలకి చేర్చారు. మిడిల్ ఈస్ట్ లో చెలరేగిన సంఘర్షణలు, రెడ్ సీ షిప్పింగ్ ప్రమాదాల కారణంగా క్రూడ్ దిగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో సామాన్యులను ఆదుకునేందుకు మోటార్ సైకిల్స్, రిక్షాలు, చిన్న కార్ల యజమానులకు లీటరుకు 100 పాకిస్థానీ రూపాయలు సబ్సిడీని అందించే సరికొత్త టార్గెటెడ్ ఫ్యూయల్-రిలీఫ్ స్కీమ్ షరీఫ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
