Salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 25నే బ్యాంకు ఖాతాల్లో జీతం జమ..!

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతం ముందే రానుంది. సాధారణంగా ప్రతినెలా ఆఖరి తేదీల్లో అందే జీతభత్యాలు, పెన్షన్లు ఈసారి సెప్టెంబర్ 25, 2026 శుక్రవారమే ఉద్యోగులు, పింఛనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ సేవలను అందించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. దీంతో 3 రోజులు ప్రభుత్వ బ్యాంకులు మూతపడనున్నాయి. అందుకే ప్రభుత్వం ముందస్తుగా జీతాలు చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం కింద పనిచేసే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సెప్టెంబర్ 23న జారీ చేసిన ఆదేశాల ప్రకారం రక్షణ, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాలతో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగులకు, బ్యాంకు లు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసుల ద్వారా పెన్షన్ అందుకునే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఈ ముందస్తు చెల్లింపు చేయనున్నారు.
యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) తలపెట్టిన సమ్మె వల్ల నెలాఖరులో బ్యాంకింగ్ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Salary

అయితే సెప్టెంబర్ 25న ఖాతాల్లో జమయ్యే మొత్తం కేవలం ముందస్తు చెల్లింపు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తిస్థాయి జీతం, పెన్షన్ లెక్కించిన తర్వాత ఏదైనా తేడాలు ఉంటే.. దానిని అక్టోబర్ 2026 జీతంలో సర్దుబాటు చేయనున్నారు. బ్యాంకులు మూతపడటం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ ఉద్యోగుల జీతాల బిల్లులను సెప్టెంబర్ 25 నాటికి బ్యాంకులకు సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. దీనివల్ల సమ్మె ప్రారంభం కావడానికి ముందే అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

ప్రతిపాదిత సమ్మెకు ముందు వినియోగదారులకు సౌకర్యం కల్పించేందుకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు ఆదివారం కూడా తెరిచి ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ సమ్మె జరిగితే, తమ బ్యాంకింగ్ అవసరాల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ) పాయింట్లు, యూపీఐ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవాలని వినియోగదారులను కోరుతూ అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు సలహాలను జారీ చేశాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+