Suzlon Shares: భారత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన అనేక స్టాక్స్ లాభపడుతున్నాయి. ఈ క్రమంలో విండ్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న సుజ్లాన్ వరుస పెరుగుదలతో ఇన్వెస్టర్లను ఉత్తేజపరుస్తున్నాయి.
ఈ క్రమంలో నేడు సుజ్లాన్ ఎనర్జీ షేర్లు ఇంట్రాడేలో 3.5 శాతం లాభపడి వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్ల ప్రతికూలతల మధ్య ముందుకు సాగుతోంది. దీంతో నేడు స్టాక్ తన సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. దీంతో మల్టీబ్యాగర్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మార్కెట్ క్యాప్ తొలిసారిగా శుక్రవారం లక్ష కోట్ల మార్కును దాటిన తర్వార నేడు రూ.1.07 లక్షల కోట్లుగా నిలిచింది. ఈ క్రమంలో నేడు కంపెనీ షేర్లు అత్యధికంగా రూ.79.30 స్థాయికి ఉదయం చేరుకున్నాయి. టెక్నికల్స్ పరిశీలిస్తే ఇప్పటికీ స్టాక్ తన బులిష్ జోన్ లో కొనసాగుతోంది. ఇది కంపెనీ షేర్లలో అధికంగా కొనుగోలుదారులను సూచిస్తోంది.

రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ ఓవర్‌బాట్ జోన్‌లో ట్రేడింగ్ అవుతోంది. మల్టీబ్యాగర్ స్టాక్ RSI 77.3 వద్ద ఉంది. దీనికి ముందు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఒక్కోటి రూ.76.58 స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధర 52 వారాల కనిష్ఠం నుంచి 312 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. అలాగే స్టాక్ మూడేళ్ల కాలంలో 1218% లాభపడింది.
కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ వ్యూహాన్ని పరిశీలిస్తే.. ఇటీవల స్టాక్ రూ.71 జోన్ లక్ష్యాన్ని అధిగమించిందని ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కూతుపలక్కల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్ బలమైన అప్‌ట్రెండ్‌తో ర్యాలీ చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో స్టాక్ స్టాక్ ధర రూ.82-రూ.98 స్థఆయిలకు చేరుకోవచ్చని టార్గెట్ ధరను అందించారు. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.71ని స్టాప్ లాస్ ధరగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఇదే క్రమంలో శాంక్టమ్ వెల్త్ హెడ్ డెరివేటివ్స్ & టెక్నికల్ ఆదిత్య అగర్వాల్ కంపెనీ షేర్లు రానున్న కొన్ని నెలల్లో రూ.94-102 స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. అయితే రూ.64 స్టాప్ లాస్ ధరగా కొనసాగించాలని సూచించారు.
మిగిలిన బ్రోకరేజ్ సంస్థలు..
ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్- టార్గెట్ ధర రూ.80, స్టాప్ లాస్ ధర రూ.65
యెస్ సెక్యూరిటీస్- టార్గెట్ ధర రూ.80, స్టాప్ లాస్ ధర రూ.65
జియోజిత్ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందించింది.
Hedged.in స్టాక్ టార్గెట్ ధరను రూ.89గా ప్రకటించింది


Click it and Unblock the Notifications