Closing Bell: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ ముగింపును చూశాయి. వాస్తవానికి నేడు ఇంట్రాడేలో బ్యాంకింగ్ స్టాక్స్ సూపర్ పనితీరుతో కీలక బెంచ్ మార్క్స్ నష్టాల నుంచి తిరిగి తేరుకున్నాయి. ప్రధానంగా ఓలటాలిటీ దీనికి కారణంగా నిలిచింది.
మార్కెట్లు ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 42 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం భారీగా లాభపడి 957 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ నష్టాలతో ఇంట్రాడేలో కొనసాగి చివరికి 538 పాయింట్లను క్లోజింగ్ నాటికి కోల్పోయింది. ఈ క్రమంలో ప్రైవేటు బ్యాంకింగ్ కంపెనీలైన యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, బాంధన్ బ్యాంక్ షేర్లు నేడు 1-3 శాతం మధ్యలో లాభపడ్డాయి.

మార్కెట్ల ముగింపు సమయంలో ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టైటాన్, మారుతీ, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఎల్ టి, హిందాల్కొ, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications