Market Opening: నిన్న ఒడిదొడుకుల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 80,000 మార్కున క్రాస్ చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 24250 మార్కుకు పైన ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
రోజుకో రికార్డు కొల్లగొడుతున్న సెన్సెక్స్ తన దూకుడును నేడు సైతం భారత ఈక్విటీ మార్కెట్లలో కొనసాగిస్తున్న వేళ.. ఉదయం 9.29 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 478 పాయింట్ల లాభంతో 79920 వద్ద ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 694 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 216 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రధానంగా జొమాటో, హెచ్డీఎఫ్సీ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, నెస్లే, ఎయిర్ టెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు మార్కెట్ల ప్రారంభంలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టైటాన్, విప్రో, దివీస్ ల్యాబ్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని టాప్ లూజర్లుగా కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications