Market Fall: ఉదయం జీవిత గరిష్ఠాలను తాకిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలుస సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి మార్కెట్లలో ఐటీ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అనేక రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో పతనాన్ని కొనసాగిస్తున్నాయి.
మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 512 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 172 పాయింట్లను కోల్పోయాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు ఏకంగా 2 శాతం మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, టాటా టెలిసర్వీసెస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఐఆర్‌ఈడీఏ, రైల్ వికాస్ నిగమ్ షేర్లు ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో యాక్టివ్ షేర్లుగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 388 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 936 పాయింట్లు పతనాన్ని చూస్తున్నాయి.

ఇదే క్రమంలో మార్కెట్లో ట్రేడర్లు సైతం ఆర్డర్లు పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఏంజల్ వన్, 5పైసా, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ యూజర్లు మార్కెట్ ఆర్డర్లు పెట్టడంలో అవాంతరాలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు. దీనికి సైబర్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ క్రౌడ్‌స్ట్రైక్‌లో అంతరాయాలు సమస్యలను కలిగిస్తున్నట్లు IIFL సెక్యూరిటీస్ తన క్లయింట్‌లకు బదులిచ్చింది. క్రౌడ్‌స్ట్రైక్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ సాఫ్ట్‌వేర్‌తో సమస్య కారణంగా దీనిని వినియోగిస్తున్న అన్ని ప్రధాన బ్రోకరేజ్ కంపెనీలు టెక్నికల్ గ్రిచ్ చూస్తున్నాయి. అయితే దీనిని పరిష్కరించేందుకు తమ టెక్నికల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు 5పైసా తన కస్టమర్లకు బదులిచ్చింది.
హెవీవెయిట్ ఇన్ఫోసిస్‌లో బలమైన క్యూ1 ఫలితాల తర్వాత బ్రాడ్-బేస్డ్ ప్రాఫిట్ బుకింగ్ నమోదైంది. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు అత్యంత గరిష్ఠ వ్యాల్యుయేషన్ల వద్ద కొనసాగటంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు వెళ్లటం మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు సైతం మార్కెట్ల అస్థిరతకు కారణంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications