Market Closing: ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ర్యాలీని నమోదు చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 100 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 9 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 263 పాయింట్ల నష్టాన్ని చూసింది. ఉదయం నుంచి మార్కెట్లో చాలా మంది పెట్టుబడిదారులు అంబానీ సమావేశంలో ఎలాంటి ప్రకటనలు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు. కంపెనీ ఏఐ ఉత్పత్తులతో పాటు రిటైల్ వ్యాపార విస్తరణ వంటి ప్రణాళికలను పంచుకోవటంతో ఇన్వెస్టర్లలో జోష్ కనిపించింది. ఈ ప్రకటనలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పెరుగుదలతో పాటు, మార్కెట్లను లాభాల దిశగా ప్రయాణానికి ప్రేరేపించింది.

ఈ క్రమంలో గతంలో రియలన్స్ ఏజీఎం సమయంలో నిఫ్టీ సూచీ ఎలా స్పందించింది, ఎంత రాబడులను అందించిందనే వివరాలు ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తు్నాయి. చివరిసారిగా ఆగస్టు 28, 2023లో రిలయన్స్ ఏజీఎం రోజున నిఫ్టీ సూచీ 0.21 శాతం లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే నేడు బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 0.40 శాతం వృద్ధిని చూసింది. అలాగే మార్కెట్ల క్లోజింగ్ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర 1.55 శాతం వృద్ధి చెంది రూ.3042.90 వద్ద ఎన్ఎస్ఈలో క్లోజ్ అయ్యింది.
NSEలో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, రిలయన్స్, ఐటీ, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని ముగించాయి. అలాగే గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications