DMart Q3 Results: డీమార్ట్ స్టోర్లు అనగానే ముందు గుర్తుకొచ్చేది తగ్గింపు ధరలు. అవును మిగిలిన అనేక స్టోర్లతో పోల్చితే ఇక్కడ సరసమైన ధరలకు వస్తువులు లభిస్తాయనే చెరగని ముద్రను వేసుకుంది కంపెనీ. మధ్య తరగతి నుంచి ఉద్యోగుల వరకు అందరిలోనూ కంపెనీపై ఇదే అభిప్రాయం ఉంది.
ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తున్న వేళ కంపెనీ గట్టిపోటీనే అందుకుంటోంది. ఎందుకంటే చిన్న వస్తువు అవసరమైనా స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో లేదా ఇతర ఆటగాళ్ల నుంచి ప్రజలు కేవలం 10-20 నిమిషాల్లో డెలివరీ పొందటంతో రిటైల్ స్టోర్ల వ్యాపారం భారీగా దెబ్బతింటోంది. అయితే ఆ ప్రభావం ప్రస్తుతం డీమార్ట్ స్టోర్లపై కూడా కొంత కనిపిస్తోందని ఒప్పుకోవాల్సిన వాస్తవం. దశాబ్ధాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వ్యాపారంలో వస్తున్న మార్పులతో కంపెనీ ఒత్తిడిని చూస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కంపెనీ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ నికర లాభం 4.8 శాతం వృద్ధితో రూ.723.54 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.690.41 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుతం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.69 శాతం పెరిగి రూ.15,972.55 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు 18.52 శాతం పెరిగి రూ.15,001.64 కోట్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో మెుత్తం ఆదాయం 17.57 శాతం వృద్ధితో రూ.15,996.69 కోట్లుగా నమోదయ్యాయి.
కంపెనీలో గందరగోళం..
రిటైల్ స్టోర్ల వ్యాపారంలో అగ్రగామి ఆటగాళ్లలో ఒకరుగా ఉన్న డీమార్ట్ కంపెనీలో సీఈవో తాజాగా రాజీనామా చేశారు. కంపెనీతో దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నెవిల్లే నొరోన్హా ప్రస్తుతం రాజీనామా చేయటం గందరగోళానికి కారణమైంది. జనవరి 2004లో కంపెనీలో చేరినప్పుడు డీమార్ట్ కేవలం 5 స్టోర్లను కలిగి ఉండగా.. ఆయన నేతృత్వంలో ప్రస్తుతం స్టోర్ల సంఖ్య 380కి చేరుకోవటం గమనార్హం. ప్రస్తుతం దమానీ కంపెనీకి మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో స్టోర్లను నిర్వహిస్తోంది.
జనవరి 2026లో వాస్తవానికి ప్రస్తుత సీఈవో టర్మ్ ముగియనుంది. నోరోన్హా నిష్క్రమణతో, ఫిబ్రవరి 1, 2026న థాయిలాండ్‌లోని యూనిలీవర్ దేశ అధిపతి, గ్రేటర్ ఆసియా, హోమ్ కేర్, జనరల్ మేనేజర్ అన్షుల్ అసవా MD, CEOగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. అసవా 1995లో యూనిలీవర్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. భారతదేశంలోని బహుళ భౌగోళిక ప్రాంతాల్లో ఆహారాలు, రిఫ్రెష్‌మెంట్ వ్యాపారంలో అమ్మకాలు, మార్కెటింగ్‌లో సీనియర్ నాయకత్వ పాత్రలను పోషించారు. అలాగే దేశంలోని ప్రసిద్ధ టీ బ్రాండ్‌లకు మార్కెటింగ్ లీడ్ కూడా వ్యవహరించిన అనుభవం కలిగి ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications