Pushpa-2 సినిమా రిలీజ్‍తో దూసుకుపోనున్న స్టాక్ ఇదే.. కన్నేసి ఉంచండి ట్రేడర్స్..

PVR Inox Shares: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమాపై ఫుల్ హైప్ కొనసాగుతోంది. తెలుగులో కంటే అల్లు అర్జున్ బీహార్, పాట్నా ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో సినిమా విడుదలకు సర్వం సిద్ధమైన వేళ ఫ్యాన్స్ రేటెంతైనా పర్లేదంటూ బెనిఫిట్ షో కోసం ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి వచ్చేస్తోంది. టాలీవుడ్ చరిత్రలో సినిమా కలెక్షన్స్ సంచలనం సృష్టిస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పుష్ప సినిమా కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు ట్రెండ్ అవుతున్నాయి. టిక్కెట్ ధరలను పెంచుకోవటం కోసం ఏపీ సర్కార్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రీమియర్ల టికెట్ల ధరలను రూ.800 వద్ద నిర్ణయించబడింది. ఇదే క్రమంలో డిసెంబర్ 17 వరకు టిక్కెట్ ధరలను రూ.100-200 వరకు పెంచుకునేందుకు ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయటంతో ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో సైతం ఇదే తరహా రేట్లను ఖరారు చేశారు. సినిమా రిలీజ్ తేదీ నుంచి దాదాపు 10 రోజుల పాటు ఈ అధిక ధరలు అమలులో ఉండటం మూవీ లవర్స్ ని నిరాశకు గురిచేస్తున్నప్పటికీ కొన్ని కంపెనీలకు మాత్రం ఫ్యాన్స్ క్రేజ్ భారీగా రాబడిని తెచ్చిపెడుతుందని తెలుస్తోంది.

Amid Pushpa-2 release movie lovers booking advance tickes Brokerage UBS bullish on PVR Inox Shares

దేశవ్యాప్తంగా మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉండటంతో పాటు టిక్కెట్లను అడ్వాన్స్‍గా బుక్ చేసుకుంటున్నారు. దీంతో పెద్ద బిజినెస్ జరగనుందని మూవీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐకాన్స్ లిమిటెడ్‍కి కలిసిరానుందని బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ విలువ దాదాపు రూ.100 కోట్లను చేరుకుందని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ నాటికి ఈ విలువ రూ.150 కోట్లకు చేరుకోవచ్చని బ్రోకరేజ్ తన అంచనాల్లో వెల్లడించింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవనున్న వేళ ఇప్పటికే ఆ ప్రభావం పీవీఆర్ ఐనాక్స్ షేర్లపై కనిపించింది.

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో స్టాక్ 1.64 శాతం లాభంతో రూ.1,598.30 వద్ద ప్రయాణాన్ని ముగించింది. అయితే పుష్ప 2 ఫేమ్ కారణంగా ఐనాక్స్ స్టాక్ ధర సమీప భవిష్యత్తులో రూ.2,000 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ హౌస్ తన అంచనాలను ప్రకటించింది. ఈ క్రమంలో షేర్లను BUY రేటింగ్ అందించింది. కరోనా తర్వాత దేశంలో సినిమా హాళ్లకు వెళ్లి మూవీస్ చూసే ట్రెండ్ తగ్గటంతో పాటు ఓటీటీలకు ఆదారణ పెరగటంతో గడచిన రెండేళ్లుగా ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు రాబడులను అందించలేదు. ఈ క్రమంలో షేర్ల ధర దాదాపు 15.80 శాతం పతనాన్ని చూసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,694 కోట్లుగా ఉంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+