Telangana News: దేశవ్యాప్తంగా ఉల్లి సాగు చేసే కొన్ని రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలతో పంట నీట మునిగింది. పంట నష్టం ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతం సామాన్య వినియోగదారులపై పడింది. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లి చిల్లర విక్రయ ధర కేజీకి రూ.70 నుంచి రూ.80 మధ్య కొనసాగుతున్నాయి. మండీల్లో సైతం ఉల్లి ధర రూ.60కి పైనే కొనసాగుతుండటంతో వినియోగదారులకు కష్టాలు తప్పటం లేదు.
ఈ క్రమంలో ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలను తగ్గించేందుకు మార్కెట్లో లభ్యతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని నాఫెడ్ ద్వారా నేరుగా వినియోగదారులకు తక్కువ ధరలకు అందించాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాఫెడ్ ఉల్లిని ఆటోల ద్వారా కేజీని ప్రభుత్వం నిర్థేశించిన ధర కేజీకి రూ.35 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. హోల్ సేల్ మార్కెట్లకు సైతం ఉల్లి రాక తగ్గిపోయిందని బ్రోకర్లు చెబుతున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన మథానియా నుండి ఉల్లి రాక తగ్గటంతో నాశిక్ నుంచి వచ్చే ఉల్లిపై ఆధారపడినట్లు ఉల్లిపాయ బ్రోకర్ల సంఘం అధ్యక్షుడు మదన్ శర్మ వెల్లడించారు.

దీంతో హైదరాబాదు మహా నగరంలో ఉల్లి వినియోగదారులకు పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించటంతో పాటు ధరల భారం నుంచి రక్షించేందుకు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద నాఫెడ్ ఉల్లి వ్యాన్లను ప్రజలకు అందుబాటులో ఉంచిందని తెలంగాణ, ఏపీ నాఫేడ్ హెడ్ జ్యోతి పాటిల్ అన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు లేకుండా ఉల్లిని కేజీ ప్యాకెట్లు సిద్ధం చేసి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వినియోగదారుడికి 3 కేజీల చొప్పున అందిస్తోంది. నాఫెడ్ వ్యాన్లు కొనుగోలుకు వచ్చిన వినియోగదారుల నుంచి ఫోన్ నంబర్, వారి పేరు వంటి బేసిక్ వివరాలను తీసుకుని ఉల్లిని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ భరత్ నగర్ వద్ద నాఫెడ్ ఆధ్వర్యంలో రూ.35 లకే కిలో ఉల్లి విక్రయిస్తున్నారు. సబ్సిడీలో అందిస్తున్న ఉల్లిని కొనుగోలు చేసేందుకు జనం మెుబైల్ వ్యాన్ల దగ్గర బారులు తీరుతున్నారు.
వన్ ఇండియా తెలుగు టీమ్ నాఫెడ్ అందిస్తున్న మెుబైల్ వ్యాన్లకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతి పాటిల్ ఉల్లి విక్రయాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఏపీలో మంగళవారం ఉల్లి విక్రయ ధరలను వివిధ ప్రాంతాల్లో పరిశీలిస్తే.. విజయవాడ రైతు బజార్లలో కిలో రూ.55, కర్నూలులో కిలో రూ.42, తాడేపల్లిగూడెం మార్కెట్లో కిలో రూ.52 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వర్షాల కారణంగా ఇతర కూరగాయల ధరలు సైతం ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బంగాళదుంపలు, కందిపప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి వంటి ఇతర వస్తువుల రేట్లు సైతం పెరగటం ప్రారంభించాయి. మరో పక్క గతవారంలో సుంకం పెంపుతో భారీగా పెరిగిన నూనెల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications