AP Liquor Policy: ఏపీలో ప్రస్తుతం మద్యం దుకాణాల నిర్వహణ రగడ కొనసాగుతోంది. గత వైకాపా ప్రభుత్వం షాపులను సర్కార్ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటితో వైన్ షాప్స్ గడువు ముగియటంతో కాంట్రాక్టు ఉద్యోగులు మరో 10 రోజులు వీటిని నిర్వహించాలని కూటమి ప్రభుత్వం కోరింది. అయితే దీనికి సదరు ఉద్యోగులు ససేమిరా అనటంతో చిక్కులు మెుదలయ్యాయి.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని కొత్త పాలసీని తీసుకురావటంతో తమ ఉద్యోగాలు పోతాయని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనను వ్యక్తం చేస్తు నేటి నుంచే వారు విధులకు హాజరు కాకపోవటంతో అనేక చోట్ల వైన్ షాప్స్ మూతపడ్డాయి. ఈ పరిస్థితులపై మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వానికి ప్రధానా ఆదాయవనరుల్లో ఒకటైన మద్యం అమ్మకాలు నిలిచిపోవటంపై సర్కార్ సైతం కొంత ఆందోళనలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షోభంలో పాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ పరిస్థితులు కొత్త తలనొప్పిగా మారాయి. అనేక ప్రాంతాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉపాధికి ప్రభుత్వం హామీ ఇవ్వాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ క్రమంలో నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం తెచ్చిన గత మద్యం పాలసీ ప్రాణాలను హరించిందన్నారు. మద్యం రవాణా, అమ్మకాలు, కల్తీ గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం రానున్న 10 రోజుల్లో కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మద్యం షాపుల్లో 10 శాతం కల్లుగీత కార్మికుల కోసం రిజర్వు చేసినట్లు ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 11న లాటరీ ద్వారా దరఖాస్తుదారుల్లో అదృష్టవంతులు షాపులను పొందుతారని తద్వారా 12 నుంచి కొత్త షాపులు తెరచుకోనున్నాయి. అయితే దరఖాస్తులు వేసే సభ్యులు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాల్సి ఉంటుంది.
దుకాణాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని జనాభాకు అనుగుణంగా లైసెన్స్ రుసుములు ఉండనున్నాయి. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా లైసెన్సు రుసుము నిర్ణయించబడింది. ఈ క్రమంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. నగరపాలక సంస్థల్లో మినహా మిగిలిన చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పిస్తూ దీనికోసం ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలని కోరింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications